Page Loader
గ్లోబల్ మార్కెట్ లో విడుదలైన 2023 యమహా గ్రాండ్ ఫిలానో
గ్లోబల్ మార్కెట్‌లలో గ్రాండ్ ఫిలానో 2023 వెర్షన్ విడుదల

గ్లోబల్ మార్కెట్ లో విడుదలైన 2023 యమహా గ్రాండ్ ఫిలానో

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 20, 2023
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

టూ-వీలర్ తయారీ సంస్థ యమహా గ్లోబల్ మార్కెట్‌లలో గ్రాండ్ ఫిలానో 2023 వెర్షన్ ను విడుదల చేసింది.ఇప్పుడు ఇందులో మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది. ఇది భారతదేశంలో అమ్ముతున్న Fascino 125 Fi హైబ్రిడ్ కు అప్‌గ్రేడ్ వెర్షన్. ప్రస్తుతానికి, ఈ బ్రాండ్ భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనేది ఆ సంస్థ ఇంకా తెలియజేయలేదు. ఆసియా, యూరోపియన్ మార్కెట్‌లలో స్కూటర్ సెగ్మెంట్‌లో యమహా టాప్ స్థానంలో ఉంటుంది. ప్రసిద్ధ టూరింగ్-సామర్థ్యం గల మ్యాక్సీ-స్కూటర్ XMAX 300 వంటి మోడల్‌లు ఈ బ్రాండ్ నుండి వచ్చినవే. యువ వినియోగదారులను ఆకర్షించడానికి, MY-2023 అప్‌డేట్‌లో భాగంగా బ్లూటూత్ ఆధారిత ఫంక్షన్‌లతో పాటు మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో నగర జీవనానికి అనుకూలంగా ఉండే గ్రాండ్ ఫిలానోను రూపొందించింది.

బైక్

ఈ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది

ఇందులో LED హెడ్‌లైట్, ఆప్రాన్-మౌంటెడ్ ఇండికేటర్‌లు, DRL, ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, వెడల్పాటి హ్యాండిల్‌బార్, సింగిల్-పీస్ రిబ్డ్-ప్యాటర్న్ సీట్ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ISG)తో ఉన్న 125cc, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్‌ సపోర్ట్ తో నడుస్తుంది. రైడర్ భద్రత కోసం మెరుగైన బ్రేకింగ్ పనితీరు ఉండే కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS)తో పాటు ఫ్రంట్ వీల్‌పై డిస్క్ బ్రేక్, వెనుక చక్రంలో డ్రమ్ బ్రేక్‌ ఉన్నాయి. ఇండోనేషియా మార్కెట్లో, 2023 యమహా గ్రాండ్ ఫిలానో బేస్ నియో వేరియంట్‌ ధర IDR 27 మిలియన్లు (సుమారు రూ. 1.45 లక్షలు), రేంజ్-టాపింగ్ లక్స్ ట్రిమ్ ధర IDR 27.5 మిలియన్లు (సుమారు రూ. 1.48 లక్షలు) ఉంది.