2023 హోండా CB500X vs బెనెల్లీ TRK 502 ఏది మంచిది
2023 హోండా CB500X త్వరలో భారతదేశంలో కూడా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది ఇదివరకే గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న బెనెల్లీ TRK 502కి పోటీగా వస్తుంది. అయితే రెండింటిలో ఏది మంచిది అనేది తెలుసుకుందాం. హోండా ఎంట్రీ-లెవల్ 200cc నుండి ఫుల్-సైజ్ లీటర్-క్లాస్ మోడల్‌ల వరకు ADVలను రూపొందించింది. అయితే 500cc ADV విభాగంలో అత్యుత్తమ మోటార్‌సైకిల్ గా పేరు పొందాలంటే బెనెల్లీ TRK 502కన్నా మెరుగ్గా ఉండాలి. రెండు బైక్‌లలో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. అయితే, CB500Xలో స్లిప్పర్ క్లచ్ ఉంది. రైడర్ భద్రత కోసం, హోండా CB500Xలో, బెనెల్లీ TRK 502లో డ్యూయల్-ఛానల్ ABSతో పాటు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.
అప్‌గ్రేడ్ సస్పెన్షన్ సెటప్ తో హోండా CB500X
హోండా CB500Xలో మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, LED హెడ్‌ల్యాంప్, నిటారుగా ఉండే విండ్‌స్క్రీన్, స్టెప్-అప్ సీటు, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్, గ్రాబ్ రైల్స్, LED టెయిల్‌ల్యాంప్ ఉన్నాయి. బెనెల్లీ TRK 502లో డిజైన్ చేసిన ఇంధన ట్యాంక్,, ట్విన్-పాడ్ హెడ్‌లైట్, స్ప్లిట్-స్టైల్ సీట్లు, పిలియన్ గ్రాబ్ రైల్ తో పాటు హై-మౌంటెడ్ ఎగ్జాస్ట్ ఉంది. భారతదేశంలో, బెనెల్లీ TRK 502 ధర రూ. 5.49 లక్షలు నుండి రూ. 6.19 లక్షలు.హోండా CB500X ధర సుమారుగా రూ. 6.8 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). అయితే స్లిప్పర్ క్లచ్‌తో, ట్విన్ ఇంజన్ తో పాటు అప్‌గ్రేడ్ సస్పెన్షన్ సెటప్ తో మెరుగైన పనితీరు ఉన్న హోండా CB500X రెండింటిలో మెరుగైనది అని చెప్పచ్చు.