Page Loader
2023 వేసవిలో తన ఇండియా వెర్షన్ SUVని లాంచ్ చేయనున్న హొండా
హోండా SUVలో రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి

2023 వేసవిలో తన ఇండియా వెర్షన్ SUVని లాంచ్ చేయనున్న హొండా

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 10, 2023
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

హోండా తన SUVని మే 2023 నాటికి భారతదేశంలో లాంచ్ పండుగ సీజన్‌లో అమ్మకాలు మొదలుపెట్టే అవకాశముంది. తాజా అప్డేట్ లో , ఈ బ్రాండ్ వాహనం టీజర్ చిత్రాన్ని విడుదల చేసింది. ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ తో వస్తుంది. హోండా రాబోయే SUVని చాలా కాలంగా తయారీలోనే ఉంచింది. ఇది ఓవర్సీస్‌లో విక్రయిస్తున్న HR-V మోడల్ పోలికలతో ఉండే అవకాశముంది. అయితే అధికంగా స్థానిక అవసరాలకు అనుకూలంగా ఉంటుంది అయితే ధర మీద సృష్టత రాలేదు. ఇది మార్కెట్లో స్కోడా కుషాక్, హ్యుందాయ్ క్రెటా, వోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి ప్రత్యర్థులతో తలపడనుంది. ఇందులో పొడవాటి హుడ్, LED DRLలు, ఎయిర్ వెంట్‌ బంపర్, గుండ్రటి ఫాగ్ ల్యాంప్‌లు ఉన్నాయి.

కార్

ధర లాంచ్ సమయంలో ప్రకటించే అవకాశం ఉంది

కొత్త హోండా మిడ్-సైజ్ SUV 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌తో నడుస్తుంది. ఇందులో ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, సన్‌రూఫ్ ఉంటుంది. రాబోయే హోండా SUVలో ఆటో క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్స్, సన్‌రూఫ్, కీలెస్ ఎంట్రీ, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌, విశాలమైన క్యాబిన్‌ను ఉండే అవకాశం ఉంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, తాజా కనెక్టివిటీ ఆప్షన్‌లకు సపోర్ట్‌తో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది. వెనుక కెమెరా, కారులో భద్రత కోసం ABS, EBD సిస్టం ఉన్నాయి. దీని ధర, ఇతర వివరాలు లాంచ్ సమయంలో ప్రకటిస్తారు. అయితే ప్రారంభ ధర దాదాపు రూ. 11 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండచ్చు.