
Aprilia SR 175: ఏప్రిలియా SR 175 వచ్చేసింది.. రూ.1.26లక్షల్లో స్మార్ట్ బ్లూటూత్ TFT స్క్రీన్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటలీకి చెందిన ప్రముఖ స్కూటర్ తయారీ సంస్థ 'ఏప్రిలియా' భారత మార్కెట్‌లో కొత్తగా ప్రీమియం స్కూటర్‌ను విడుదల చేసింది. ఎస్‌ఆర్ 175 పేరుతో వచ్చిన ఈ మోడల్ ధరను కంపెనీ రూ. 1.26 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఎస్‌ఆర్ 160 స్థానంలో ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చారు. లుక్స్ పరంగా ఇది ఎస్‌ఆర్ 160కి దగ్గరగా ఉన్నా, మెరుగైన ఇంజిన్ పనితీరుతో ఆకర్షణీయంగా నిలుస్తోంది. ఈ స్కూటర్‌లో 174.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను త్రీ వాల్వ్ సెటప్‌తో అందించారు.
Details
నోటిఫికేషన్లు, అలర్ట్‌లు, మ్యూజిక్ వంటి ఫీచర్లు
ఇది 7200 ఆర్‌పీఎం వద్ద 12.92 హెచ్‌పీ పవర్, 14.14 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పూర్వాది ఎస్‌ఆర్ 160లో 11.27 హెచ్‌పీ పవర్, 13.44 ఎన్ఎం టార్క్ మాత్రమే ఉండేది. పనితీరులో ఇది స్పష్టమైన మెరుగుదల. స్మార్ట్ ఫీచర్ల పరంగా చూస్తే.. స్కూటర్‌కు కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. దీని ద్వారా కాల్ నోటిఫికేషన్లు, అలర్ట్‌లు, మ్యూజిక్ వంటి ఫీచర్లను స్మార్ట్‌ఫోన్ ద్వారా స్క్రీన్‌పై చూడొచ్చు. చాసిస్, సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్, టైర్లు మొదలైన భాగాలు ఎస్‌ఆర్ 160 మాదిరిగానే ఉంటాయి. స్కూటర్ ముందు, వెనుక 14 అంగుళాల టైర్లు అమర్చారు. వెడల్పు 120 సెక్షన్‌తో వస్తుంది.
Details
రెడ్-వైట్, పర్పుల్-రెడ్ కలర్ కాంబినేషన్లలో లభ్యం
సింగిల్ ఛానల్ ఏబీఎస్‌తో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ అందుబాటులో ఉంది. వాహనం రెడ్-వైట్, పర్పుల్-రెడ్ కలర్ కాంబినేషన్లలో లభ్యమవుతుంది. ఇది ఏప్రిలియా ప్రీమియం స్పోర్ట్ బైక్ ఆర్‌ఎస్ 457 నుంచి ప్రేరణ పొందిన పెయింట్ స్కీమ్‌తో రూపొందించారు. స్పోర్టీ డిజైన్, అధిక శక్తి కలిగిన ఇంజిన్ కారణంగా హీరో జూమ్ 160, యమహా ఏరోక్స్ 155 మోడళ్లకు ఇది గట్టి పోటీగా నిలవనుంది.