Top 5 Upcoming SUVs in India 2026:మీరు కొత్త SUV కోసం చూస్తున్నారా? భారత్‌లోకి రాబోయే టాప్5 ఎస్‌యూవీలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత కార్ మార్కెట్‌లో త్వరలో పలు కొత్త మోడళ్లు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా ఈ లిస్టులో ఎక్కువగా ఎస్‌యూవీ విభాగానికి చెందిన వాహనాలే ఉండటం విశేషం. కొన్ని మోడళ్లు పూర్తిగా కొత్తగా రానుండగా, మరికొన్ని ఇప్పటికే ఉన్న మోడళ్లకు అప్డేటెడ్ లేదా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లుగా మార్కెట్‌లోకి రానున్నాయి. రాబోయే టాప్ 5 ఎస్‌యూవీల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం
Details
మహీంద్రా XUV 7XO
మహీంద్రా XUV 7XO అనేది ప్రస్తుత XUV700కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా రానుంది. ఈ ఎస్‌యూవీని 2026 జనవరి 5న విడుదల చేయనున్నారు. కొత్త డిజైన్‌తో పాటు ఇన్వర్టెడ్ ఎల్ ఆకారంలో డీఆర్‌ఎల్‌లతో డ్యూయల్ పాడ్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, బ్లాక్ కలర్ గ్రిల్, కొత్త టెయిల్ లైట్లు ఇందులో ఆకర్షణగా నిలవనున్నాయి. క్యాబిన్‌లో మూడు స్క్రీన్‌ల సెటప్ ఉండనుంది. ఇంజిన్ పరంగా ఇప్పటి వరకు ఉన్న 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఆప్షన్లే కొనసాగనున్నాయి. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు లభించనున్నాయి. అదనంగా ఆల్ వీల్ డ్రైవ్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.
Details
నిస్సాన్ టెక్టన్
నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీని 2026 ప్రారంభంలో విడుదల చేయనున్నారు. దీనిని కొత్త రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేశారు. ఈ కారు హ్యుందాయ్ క్రెటాకు ప్రధాన పోటీదారుగా నిలవనుంది. ఎల్‌ఈడి లైట్లు, ఆకర్షణీయమైన క్రోమ్ డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో కనిపించనున్నాయి. లాంచ్ సమయం దగ్గరపడే కొద్దీ మరిన్ని ఫీచర్లను కంపెనీ వెల్లడించనుంది.
Details
కొత్త తరం కియా సెల్టోస్
కొత్త తరం కియా సెల్టోస్ ఇప్పటికే ఆవిష్కరణ పొందింది. ఇందులో కొత్త స్టైలింగ్, కొంచెం పెద్ద సైజు, పూర్తిగా రీడిజైన్ చేసిన ఇంటీరియర్స్ ఉన్నాయి. క్యాబిన్‌లో రెండు 12.3 అంగుళాల స్క్రీన్‌లు, వెంటిలేటెడ్ సీట్లు, పానోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఇంజిన్ ఆప్షన్లుగా 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ యూనిట్లు ఉంటాయి. ఈ కార్ ధరలను 2026 జనవరి 2న ప్రకటించనున్నారు. ప్రారంభ ధర సుమారు రూ. 12 లక్షలు ఉండవచ్చని అంచనా.
Details
కొత్త రెనాల్ట్ డస్టర్
కొత్త తరం రెనాల్ట్ డస్టర్ కూడా 2026 ప్రారంభంలో భారత మార్కెట్‌లోకి రానుంది. ఇది పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందించారు. బలమైన, మస్కులర్ డిజైన్‌తో పాటు హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ వేరియంట్లు, మెరుగైన ఆఫ్‌రోడ్ సామర్థ్యం దీని ప్రత్యేకతలు. ఇప్పటికే ఈ మోడల్ విదేశీ మార్కెట్లలో అమ్మకాల్లో ఉంది. భారత్‌లో ఇది 15 లక్షల రూపాయల లోపు ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అడ్వెంచర్ ఎస్‌యూవీ ప్రేమికులను మళ్లీ ఆకట్టుకోవడమే దీని లక్ష్యం.
Details
మారుతి సుజుకి ఈ-విటారా
మారుతి సుజుకి ఈ-విటారా భారత మార్కెట్‌లో కంపెనీ నుంచి వచ్చే మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా నిలవనుంది. ఇప్పటికే దీనిని ఆవిష్కరించారు. ఈ కారు 49 కిలోవాట్ అవర్, 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. రెండూ ఫ్రంట్ వీల్ డ్రైవ్ సెటప్‌లోనే ఉంటాయి. పెద్ద బ్యాటరీతో 543 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ-విటారా మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. బేస్ వేరియంట్ డెల్టాలో 49 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. మొత్తంగా చూస్తే, రాబోయే రోజుల్లో భారత మార్కెట్‌లో ఎస్‌యూవీల హవా కొనసాగడం ఖాయమని ఆటో రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.