Loading...
Aston Martin: కాల్ ఆఫ్ డ్యూటీ కోసం ఆస్టన్ మార్టిన్ 'డ్రెడ్‌నాట్' ఎస్‌యూవీ
కాల్ ఆఫ్ డ్యూటీ కోసం ఆస్టన్ మార్టిన్ 'డ్రెడ్‌నాట్' ఎస్‌యూవీ

Aston Martin: కాల్ ఆఫ్ డ్యూటీ కోసం ఆస్టన్ మార్టిన్ 'డ్రెడ్‌నాట్' ఎస్‌యూవీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 20, 2026
01:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్టన్ మార్టిన్ ప్రముఖ వీడియో గేమ్ కాల్ ఆఫ్ డ్యూటీ: మోడర్న్ వార్‌ఫేర్ 4 కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'డ్రెడ్‌నాట్' అనే మిలిటరీ శైలిలోని 4x4 ఎస్‌యూవీని ఆవిష్కరించింది. బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థకు చెందిన ప్రత్యేక డిజైన్‌ను మరింత దృఢమైన రూపంలో ఈ వర్చువల్ వాహనంలో చూపించారు. దీనికి సంబంధించిన పూర్తి పరిమాణ మోడల్ ప్రస్తుతం న్యూయార్క్‌లో జరిగిన ఫ్యానాటిక్స్ ఫెస్ట్లో జూలై 19 వరకు ప్రదర్శనకు ఉంచారు. ఈ డ్రెడ్‌నాట్‌ను గేమ్ డెవలపర్లు,ప్రచురణ సంస్థలతో కలిసి రూపొందించారు. రాబోయే కాల్ ఆఫ్ డ్యూటీ: మోడర్న్ వార్‌ఫేర్ 4లో ఉపయోగించే ప్రత్యేక వాహనాల జాబితాలో దీనిని చేర్చనున్నారు.

వివరాలు 

మిలిటరీ స్పెసిఫికేషన్‌తో రూపొందించిన ఆఫ్‌రోడర్

బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన చారిత్రక యుద్ధనౌక హెచ్‌ఎంఎస్ డ్రెడ్‌నాట్ నుంచి ఈ పేరును తీసుకున్నట్లు ఆస్టన్ మార్టిన్ తెలిపింది.

ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తివంతమైన యంత్రం అనే భావనను ప్రతిబింబించేలా దీనిని రూపొందించారు.

సాధారణ రోడ్డుపై నడిచే ఎస్‌యూవీలా కాకుండా,ఇది పూర్తిగా కల్పిత మిలిటరీ స్పెసిఫికేషన్‌తో రూపొందించిన ఆఫ్‌రోడర్. భారీ ఆకృతి,బలమైన బాడీ డిజైన్,కఠినమైన పరిస్థితులను తట్టుకునేలా కనిపించే స్టైలింగ్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

చిల్టర్న్ గ్రీన్ రంగులో రూపొందించిన ఈ వాహనం ముందు భాగంలో అడ్డంగా అమర్చిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్,పిక్సెల్ శైలి గ్రిల్, మెష్ డిజైన్ ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్‌పై వెండి రంగు టో హుక్స్, స్కిడ్ ప్లేట్ అమర్చి మరింత బలమైన రూపాన్ని ఇచ్చారు.

వివరాలు 

ఫీచర్స్ 

పక్క భాగంలో భారీ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, మందమైన ఆఫ్‌రోడ్ టైర్లు,చతురస్రాకార వీల్ ఆర్చ్‌లు, షార్ప్ బాడీ లైన్లు ఆకట్టుకుంటాయి.

కెమెరా ఆధారిత రియర్ వ్యూ మిరర్లు, నలుపు-వెండి రంగు డోర్ క్లాడింగ్, వెండి రంగు సైడ్ స్టెప్స్ దీనికి కాన్సెప్ట్ వాహనానికి తగ్గ ఆధునిక రూపాన్ని అందించాయి.

వెనుక భాగంలో బహుళ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, వాలర్ మోడల్‌ను గుర్తు చేసే ఏరోడైనమిక్ ఫిన్స్, ఆస్టన్ మార్టిన్ లోగోతో కూడిన బ్లాక్ స్ట్రిప్, నాలుగు ఎగ్జాస్ట్ పైపులు, స్కిడ్ ప్లేట్ ఉన్నాయి.

మొత్తం మీద ఇది లగ్జరీ ఎస్‌యూవీ కంటే కఠినమైన భూభాగాల్లో ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్న యుద్ధ వాహనంలా కనిపిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు 

డ్యాష్‌బోర్డు మధ్యలో పెద్ద టచ్‌స్క్రీన్

లోపలి భాగంలో కూడా ఇదే మిలిటరీ థీమ్‌ను కొనసాగించారు. ఆకుపచ్చ-నలుపు రంగుల డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌కు బంగారు రంగు హైలైట్స్ జోడించారు.

రెండు సీట్ల అమరికతో గ్రీన్ లెదర్ సీట్లు, ఫిజికల్ బటన్లతో కూడిన రెండు స్పోక్ స్టీరింగ్ వీల్, స్పీడోమీటర్, టాకోమీటర్ కోసం రెండు డిజిటల్ డిస్‌ప్లేలు ఉన్నాయి.

డ్యాష్‌బోర్డు మధ్యలో పెద్ద టచ్‌స్క్రీన్‌ను అమర్చారు. ఇందులో ఆఫ్‌రోడ్ సమాచారం,గేమ్‌కు సంబంధించిన ప్రత్యేక మెనూలు కనిపిస్తాయి.

కార్బన్ ఫైబర్ ఫినిష్‌తో కూడిన సెంటర్ కన్సోల్, బంగారు రంగు గేర్ లివర్, కప్ హోల్డర్లు, ఫిజికల్ కంట్రోల్స్ ఉన్నాయి.

తలుపులపై ఉన్న నారింజ రంగు ఫ్యాబ్రిక్ పుల్ స్ట్రాప్‌లు మిలిటరీ శైలిని మరింత ప్రతిబింబిస్తాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఆస్టన్ మార్టిన్ వీ12 ఇంజిన్

డ్రెడ్‌నాట్‌లో సాధారణ గేమింగ్ వాహనాల మాదిరి కల్పిత ఇంజిన్‌ను కాకుండా, ఆస్టన్ మార్టిన్ వీ12 ఇంజిన్ శబ్దాన్ని ప్రత్యేకంగా రికార్డ్ చేసి గేమ్‌లో ఉపయోగించారు.

అలాగే డ్రైవింగ్ అనుభూతి మరింత వాస్తవికంగా ఉండేలా వాహనం పనితీరును ట్యూన్ చేశారు.

దీంతో గేమ్‌లో ఈ ఎస్‌యూవీని నడిపే సమయంలో నిజమైన ఆస్టన్ మార్టిన్ వాహనాన్ని నడిపిన అనుభూతిని అందించడమే లక్ష్యంగా కంపెనీ ఈ ప్రత్యేక మోడల్‌ను రూపొందించింది.

ADVERTISEMENT