
Vanquish: రూ.8.85 కోట్లతో ఆస్టన్ మార్టిన్ వాన్క్విష్.. 3.3 సెకన్లలో 0-100 kmph వేగం
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్(Aston Martin)భారత మార్కెట్లోకి కొత్త స్పోర్ట్స్ కారును విడుదల చేసింది.
'వాన్క్విష్ (Vanquish)' పేరుతో విడుదలైన ఈ లగ్జరీ కారు ధర రూ. 8.85 కోట్లుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు.
ప్రపంచవ్యాప్తంగా కేవలం 1000 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయనుండగా, భారత్‌లో ప్రత్యేక కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని లాంచ్ చేశారు.
పవర్‌ఫుల్ ఇంజిన్ & పెర్ఫార్మెన్స్
5.2 లీటర్ ట్విన్ టర్బో వీ12 ఇంజిన్‌తో విడుదలైన ఈ వాన్క్విష్
823 hp పవర్ - 1000 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 8స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది.
3.3 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
గంటకు 345 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
Details
అద్భుతమైన ఫీచర్లు
ఇంటిగ్రేటెడ్ బ్రేక్ స్లిప్ కంట్రోల్ (IBC)
ఇంటిగ్రేటెడ్ ట్రాక్షన్ కంట్రోల్ (ITC)
ఇంటిగ్రేటెడ్ వెహికల్ కంట్రోల్ (IVC)
ఇంటిగ్రేటెడ్ వెహికల్ డైనమిక్స్ ఎస్టిమేషన్ (IVE)
ఏబీఎస్ ఫీచర్లు - మెరుగైన నియంత్రణను అందిస్తాయి.
మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ హెడ్లాంప్స్ కారుకు అదనపు ఆకర్షణను ఇస్తాయి.
ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ - స్టైలిష్ లుక్‌ను కలిగించాయి.
మెరుగైన రైడ్ అనుభూతి
వెడల్పాటి వీల్‌బేస్‌తో వస్తున్న వాన్క్విష్, మంచి రైడింగ్ స్టెబిలిటీను అందిస్తుందని కంపెనీ తెలిపింది.
స్పోర్ట్స్ కార్ అయినా ప్రస్తుతం ఉన్న హై-ఎండ్ లగ్జరీ కార్లలో ఒకటిగా నిలిచేలా రూపొందించారు.
శక్తివంతమైన ఇంజిన్, అద్భుతమైన ఫీచర్లు, సూపర్ ఫాస్ట్ వేగంతో భారత మార్కెట్లో లగ్జరీ కార్ల ప్రియులను ఆకట్టుకుంటోంది.