
Ather 450S: ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్.. ధర, ఫీచర్లు, రేంజ్ డీటెయిల్స్ ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ఆలోచనలో ఉన్నవారికి ఇది మంచి ఆప్షన్ కావొచ్చు. సిటీ రైడింగ్‌కు సరిపోయేలా రూపొందించిన ఏథర్ 450ఎస్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఏథర్ 450ఎస్ అనేది 450 సిరీస్‌లో ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో 2.9 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ఉపయోగించారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 115 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఈస్కూటర్‌లో కలర్ LCD డిస్ప్లే, మొబైల్ యాప్ కనెక్టివిటీ(ప్రో ప్యాక్‌లో), ఏథర్ స్టాక్ అప్డేట్స్, ఆడ్స్ నేవిగేషన్, అదనంగా వేర్వేరు రైడింగ్ మోడ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 450ఎస్ గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.9 సెకన్లలోనే చేరుతుంది.
Details
ఈ మోడల్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది
ఇది కర్బ్ వెయిట్ 108 కిలోగ్రాములు. సీటు ఎత్తు 780 మిల్లీమీటర్లు ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు సుమారు 8.3 గంటల సమయం పడుతుంది. ఏథర్ 450ఎస్ స్టాండర్డ్ - ధర సుమారు రూ. 1.40 లక్షలు ఏథర్ 450ఎస్ ప్రో వేరియంట్ - ధర సుమారు రూ. 1.50 లక్షలు