చంద్రయాన్-3 విజయానికి అంకితమిస్తూ Lectrix EV LXS Moonshine స్కూటర్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రుడి మీద చంద్రయాన్-3 సురక్షితంగా దిగిన సందర్భంగా భారతీయులంతా సంతోషంగా ఉన్నారు. చంద్రయాన్-3 విజయోత్సవ సంబరాలు దేశమంతా జరుగుతున్నాయి.
అయితే చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగుపెట్టిన మొదటి దేశంగా గుర్తింపు తెచ్చుకున్నందుకు గౌరవ సూచకంగా Lectrix EV కంపెనీ నుండి LXS Moonshine స్కూటర్ లాంచ్ చేసింది.
ఈ స్కూటర్లను లిమిటెడ్ ఎడిషన్ గా కంపెనీ తీసుకువస్తోంది. మొత్తం 384యూనిట్ల స్కూటర్లను తయారు చేయబోతున్నారు. ఈ స్కూటర్ల ధర 97,999( ఎక్స్ షోరూమ్) గా ఉంది.
Details
LXS Moonshine స్కూటర్ ప్రత్యేకతలు
ఈ స్కూటర్ ని చంద్రయాన్-3 విజయం గుర్తుకు వచ్చేలా తయారు చేసారు. స్కూటర్ ముందుభాగాన ఆకాశం వైపు వెళ్తున్న రెండు బాణాలతో కూడిన గోల్డెన్ ఎంబ్లమ్ ఉంది. ఇండియా ఇప్పుడు అంతరిక్ష సమయంలో ఉందనే అర్థం వచ్చేలా ఈ డిజైన్ ని రెడీ చేసారు.
48V లిథియం-అయాన్ బ్యాటరీ, 1200W ఎలక్ట్రిక్ మోటార్ శక్తిని కలిగి ఉన్న ఈ స్కూటర్ అత్యధికంగా 50 kmph స్పీడుతో వెళ్లగలదు.
0-5సెకన్లలోనే 0-25 kmph వేగాన్ని అందుకోగలదు. అలాగే, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 89కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. ఈ స్కూటర్ ని ఛార్జ్ చేయడానికి కనీసం 3 నుండి 4గంటల సమయం పడుతుంది.