LOADING...
ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కాబోతున్న MBP C1002V క్రూయిజర్ మోటార్‌సైకిల్
క్రూయిజర్ మోటార్‌సైకిల్ ధర సుమారుగా రూ. 12 లక్షలు

ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కాబోతున్న MBP C1002V క్రూయిజర్ మోటార్‌సైకిల్

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 06, 2023
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

Keeway సంస్థ Moto Bologna Passione (MBP) త్వరలో అదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా (AARI) ద్వారా భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తుంది. క్రూయిజర్‌తో పాటు, వాహన తయారీ సంస్థ M502N స్ట్రీట్‌ఫైటర్ మోడల్‌ను కూడా ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు చేస్తుంది. కొన్ని సంవత్సరాలుగా భారతీయ మోటార్‌సైకిల్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుంది, గ్లోబల్ తయారీ సంస్థలు ఇక్కడి మార్కెట్‌పై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. Benelli, Moto Morini, keeway, QJ Motor, Zontes వంటి బ్రాండ్‌లు భారతీయ మార్కెట్లో అదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ద్వారా అమ్మకాలు జరుపుతున్నాయి. ఇక్కడి కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఇప్పుడు మరో హెరిటేజ్ వాహన తయారీ సంస్థ MBPని ఇక్కడ మార్కెట్లోకి తీసుకువస్తోంది.

మోటార్‌సైకిల్

రైడర్ భద్రత కోసం డిస్క్ బ్రేకులు

MBP C1002V ఒక సాధారణ క్రూయిజర్ మోటార్‌సైకిల్ఆకారంతో పెద్ద 22-లీటర్ టియర్‌డ్రాప్-ఆకారపు ఇంధన ట్యాంక్, రౌండ్ LED హెడ్‌ల్యాంప్ యూనిట్, హ్యాండిల్‌బార్, గుండ్రటి అద్దాలతో, స్ప్లిట్-టైప్ సీట్లు, డ్యూయల్ ఎగ్జాస్ట్‌లు, LED టెయిల్లాంప్‌తో వస్తుంది. క్రూయిజర్ బరువు 262కిలోలు ఉండచ్చు. ఇది 997cc, V-ట్విన్ ఇంజన్‌తో పనిచేస్తుంది. రైడర్ భద్రత కోసం, MBP C1002V మొత్తం బ్రేకింగ్ పనితీరును మెరుగుపరచడానికి డ్యూయల్-ఛానల్ Bosch ABSతో పాటు, ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. భారతదేశంలో, MBP C1002V ధర సంబంధించిన వివరాలను ఆటో ఎక్స్‌పోలో లాంచ్ ఈవెంట్ సందర్భంగా ప్రకటిస్తారు.అయితే ఈ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ధర సుమారుగా రూ. 12 లక్షలు ఉండచ్చని అంచనా వేస్తున్నారు.