LOADING...
Car Prices Increase: కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. కొత్త ఏడాది నుంచి ఈ కార్ల ధరల పెంపు
కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. కొత్త ఏడాది నుంచి ఈ కార్ల ధరల పెంపు

Car Prices Increase: కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. కొత్త ఏడాది నుంచి ఈ కార్ల ధరల పెంపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 27, 2025
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త ఏడాది నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెనాల్ట్ ఇండియా కీలక ప్రకటన చేసింది. 2026 జనవరి నుంచి తమ వాహనాల ధరలను గరిష్టంగా 2 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈ ధరల పెంపు ప్రతి మోడల్‌, వేరియంట్‌ను బట్టి భిన్నంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఉత్పత్తి వ్యయాలు పెరగడం, ఆటోమొబైల్ రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లే ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలని పేర్కొంది. భారత వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు, మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని రెనాల్ట్ ఇండియా అధికారిక ప్రకటనలో తెలిపింది. పోటీగా మారుతున్న మార్కెట్ పరిస్థితుల్లో కూడా కంపెనీ విలువను కాపాడుకుంటూ ముందుకు సాగుతామని పేర్కొంది.

Details

ఈ ఏడాది ముగిసేలోపు కొనుగోలు చేయాలి

ప్రస్తుతం ఉన్న ధరలకే వాహనం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు 2025 డిసెంబర్ ముగిసేలోపు కొనుగోలు చేసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా, కొత్త సంవత్సరం ముందు ద్రవ్యోల్బణం, సరఫరా వ్యయాల పెరుగుదల, నియంత్రణ మార్పుల ప్రభావాన్ని తట్టుకోవడానికి ఇప్పటికే పలు ఆటో మొబైల్ కంపెనీలు ధరల పెంపు ప్రకటించాయి. మెర్సిడెస్-బెంజ్, జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా, నిస్సాన్, బీఎండబ్ల్యూ మోటొరాడ్ వంటి సంస్థలు కూడా ఇదే దారిలో సాగుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే రెనాల్ట్ ఇండియా కూడా ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్ గ్రూప్‌కు అనుబంధ సంస్థగా పనిచేస్తున్న రెనాల్ట్ ఇండియా, ప్రస్తుతం భారత మార్కెట్‌లో క్విడ్, ట్రైబర్, కైగర్ అనే మూడు మోడళ్లను విక్రయిస్తోంది.

Advertisement