LOADING...
E-Auto:ఈ-రిక్షా విభాగంలోకి బజాజ్ ఆటో.. మార్చి చివరికి మార్కెట్‌లోకి.. 
ఈ-రిక్షా విభాగంలోకి బజాజ్ ఆటో.. మార్చి చివరికి మార్కెట్‌లోకి..

E-Auto:ఈ-రిక్షా విభాగంలోకి బజాజ్ ఆటో.. మార్చి చివరికి మార్కెట్‌లోకి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2025
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. బైకులు,కార్లు,స్కూటీలు ఇలా అన్ని విభాగాల్లో ఈవీ అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. ఇక,త్రీ-వీలర్ విభాగంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశించాయి. కొనుగోలుదారులు డీజిల్ ఆటోలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేకంగా,2023లోనే మన దేశంలో 5,82,000కు పైగా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు విక్రయించబడ్డాయి. తాజాగా,బజాజ్ ఆటో ఈ-రిక్షా విభాగంలోకి అడుగు పెట్టనుంది. మార్చినెలాఖరులోగా ఈవీ రిక్షాను మార్కెట్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ వెల్లడించారు. మార్చి చివరికి నెలవారీగా 45,000యూనిట్ల విక్రయ లక్ష్యంతో ఉన్నామని,మార్కెట్ డిమాండ్‌ను బట్టి తర్వాత ఉత్పత్తిని పెంచుతామని రాకేశ్ శర్మ తెలిపారు.

వివరాలు 

 బజాజ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్ 'చేతక్' 

''ఆధునిక 'ఈ-రిక్'ను ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ఆవిష్కరించాలనే లక్ష్యంతో ఉన్నాం. ఇది ఈ విభాగంలో కొత్త ప్రమాణాలను స్థాపిస్తుంది.యజమానులు, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండే విధంగా రూపొందించాం'' అని రాకేశ్ శర్మ వివరించారు. ఆటో విభాగానికి సమానంగా ఈ-రిక్షా విభాగం కూడా వృద్ధి చెందుతుందని తెలిపారు. గత ఏడాది బజాజ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్ 'చేతక్' విడుదలైన సంగతి తెలిసిందే. ఈవీ ప్రియుల నుంచి దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ బైక్ అధిక రేంజ్, అధునాతన డిస్‌ప్లేలు, వేగవంతమైన ఛార్జింగ్, విస్తృతమైన బూట్ స్పేస్‌ను అందిస్తోంది. చేతక్ 35 సిరీస్ ద్వారా ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో మార్కెట్ వాటాను పెంచుకోవాలని బజాజ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాకేశ్ శర్మ పేర్కొన్నారు.