LOADING...
Bajaj Pulsar 220F: కొత్త అప్‌డేట్‌తో భారత్ లో విడుదలైన బజాజ్ పల్సర్ 220F 
కొత్త అప్‌డేట్‌తో భారత్ లో విడుదలైన బజాజ్ పల్సర్ 220F

Bajaj Pulsar 220F: కొత్త అప్‌డేట్‌తో భారత్ లో విడుదలైన బజాజ్ పల్సర్ 220F 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

బజాజ్ పల్సర్ సిరీస్‌కు భారతీయ రైడర్లలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ సిరీస్‌లో పల్సర్ 220F ఒక లెజెండరీ మోడల్‌గా గుర్తింపు పొందింది. కాలం గడిచినా కూడా, తన శక్తివంతమైన పనితీరు మరియు ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ బైక్ యువతను ఇప్పటికీ ఆకట్టుకుంటోంది. 2025 సంవత్సరంలో డ్యూయల్-ఛానల్ ABSతో అప్‌డేట్ అయి, పల్సర్ 220F మళ్లీ భారత మార్కెట్‌లో అడుగుపెట్టింది. తాజా అప్‌డేట్‌తో ఈ మోడల్ అధికారికంగా విడుదలై, భద్రత పరంగా మరింత మెరుగుపడింది. కొత్త పల్సర్ 220Fలో డ్యూయల్-ఛానల్ ABSతో పాటు స్వల్ప కాస్మెటిక్ మార్పులు చేశారు.

వివరాలు 

స్టైలిష్ డిజైన్‌, డ్యూయల్-ఛానల్ ABS, న్యూ డిజిటల్ కన్సోల్‌ 

అదనంగా కొన్ని కొత్త ఫీచర్లను కూడా అందించారు. డ్యూయల్ ABS కారణంగా రైడింగ్ మరింత సురక్షితంగా మారింది. డ్యూయల్-ఛానల్ ABS కలిగిన పల్సర్ బైక్‌లలో ఇది అత్యంత సరసమైన మోడళ్లలో ఒకటిగా నిలుస్తోంది. స్పోర్ట్స్ బైక్‌ను కోరుకునే వారికి ఇది బడ్జెట్‌కు అనుగుణమైన మంచి ఎంపికగా చెప్పవచ్చు. అప్‌డేట్ చేసిన పల్సర్ 220F రెండు కొత్త కలర్ ఆప్షన్‌లతో పాటు కొత్తగా రిఫ్రెష్ చేసిన గ్రాఫిక్స్‌ను కలిగి ఉంది. ఫీచర్ల పరంగా చూస్తే, ప్రస్తుత పల్సర్ మోడళ్లలో కనిపించే విధంగానే బ్లూటూత్ సపోర్ట్ ఉన్న LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఇందులో అందించారు.

వివరాలు 

రూ. 1.28 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల 

ఈ క్లస్టర్ ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అంగీకరించడం లేదా తిరస్కరించడం, మిస్డ్ కాల్స్, మెసేజ్ నోటిఫికేషన్లు, గడియారం, DTE (డిస్టెన్స్ టు ఎంప్టీ) సమాచారం వంటి ఫీచర్లు లభిస్తాయి. అయితే, ఈ బైక్‌లో ఇప్పటికీ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇవ్వలేదు. మెకానికల్‌గా పల్సర్ 220Fలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది మునుపటిలాగే 220cc సామర్థ్యం గల ఆయిల్-కూల్డ్, ట్విన్ స్పార్క్ FI DTS-i ఇంజిన్‌తోనే వస్తోంది. ఈ ఇంజిన్ 20.4 హెచ్‌పీ శక్తి , 18.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. బజాజ్ ఆటో ఈ పల్సర్ 220Fను భారత మార్కెట్‌లో రూ. 1.28 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement