
Bajaj Pulsar NS 400Z: రేసింగ్ స్టైల్‌లో కొత్త లుక్‌తో 2025 బజాజ్ పల్సర్ NS400Z వర్షన్ విడుదల..!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ద్విచక్రవాహన రంగంలో ప్రముఖ బ్రాండ్ బజాజ్ ఆటో, కొత్త సంవత్సరానికి ఒక స్టైలిష్ గిఫ్ట్‌గా 2025 పల్సర్ NS 400Z మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది. గత మోడల్‌తో పోలిస్తే పెద్దగా డిజైన్ మార్పులు కనిపించకపోయినా, ఇందులో పలు మెకానికల్, రిట్రో-ఫిట్ ఫీచర్లు చేర్చడం ద్వారా గణనీయమైన అప్‌గ్రేడ్ చేసింది. మరి ఈ వాహనంలో ఏం కొత్తగా ఉంది చూద్దాం..
వివరాలు
శక్తివంతమైన ఇంజిన్ సామర్థ్యం
2025 Pulsar NS 400Z లో 373సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉపయోగించారు. ఇదే ఇంజిన్ మునుపటి వర్షన్‌లోనూ ఉన్నప్పటికీ, ఇప్పుడు శక్తి ఉత్పత్తి 40 హెచ్‌పీ నుంచి 43 హెచ్‌పీకి పెరిగింది. స్పోర్ట్ మోడ్‌లో రెడ్‌లైన్ 10,700 ఆర్పీఎం వద్దకి పెరిగింది. ఫలితంగా వాహనం టాప్ స్పీడ్ కూడా ముందుమోడల్‌లో ఉన్న 150 కిమీ/గం నుంచి 157 కిమీ/గంకి పెరిగింది. వేగం, యాక్సిలరేషన్ ఈ బైకు యాక్సిలరేషన్‌లోనూ మెరుగైందని చెప్పవచ్చు.0-60 కిమీ/గం వేగాన్ని 2.7సెకన్లలో,గతంతో పోలిస్తే 0.5 సెకన్లు వేగంగా చేరుకుంటుంది. అలాగే 0-100 కిమీ/గం వేగాన్ని 6.4 సెకన్లలో, అంటే 0.9 సెకన్లు తక్కువలో అందుకుంటుంది.ఇది యువత కోరుకునే వేగపరమైన అనుభూతికి మరింత సమాధానం ఇస్తోంది.
వివరాలు
ఫీచర్లు,హార్డ్‌వేర్ అప్‌డేట్స్
ఈ మోడల్‌లో క్విక్‌షిఫ్టర్ గేర్ సిస్టమ్ ఇవ్వడంతో గేర్ మార్పులు మరింత మృదువుగా, వేగంగా చేస్తారు. అలాగే రిట్రోఫిట్ ఎంపికలో 150 సెక్షన్ వెడల్పు టైర్, లేదా 140 సెక్షన్ టైర్ ని ఎంపిక చేసుకునే వీలుంటుంది. బ్రేకింగ్ పరంగా, సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్ ద్వారా బ్రేక్ పనితీరు 7 శాతం మెరుగవుతుంది అని సంస్థ చెబుతోంది. ధర వివరాలు బజాజ్ ఈ కొత్త 2025 Pulsar NS 400Z మోడల్‌ను రూ. 1,92,328 (ఎక్స్-షోరూమ్) ధరకు మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది ధర పరంగా కూడా యువతకు మన్నించిన శ్రేణిలోనే ఉంది.
వివరాలు
ఈ కొత్త మోడల్‌ను ఎంతవరకు ఆదరిస్తారో..
మొత్తంగా చూస్తే, స్టైలిష్ డిజైన్, మెరుగైన ఇంజిన్ పవర్, వేగవంతమైన యాక్సిలరేషన్, ఆధునిక బ్రేకింగ్ వ్యవస్థతో 2025 Pulsar NS 400Z మోడల్‌ను బజాజ్ స్పోర్టీ బైక్ ప్రియులను దృష్టిలో ఉంచుకొని రూపొందించినట్టు స్పష్టమవుతుంది. ఇదే తన తరహాలో "Next Level NS" అని చెప్పవచ్చు. మరి పల్సర్ అభిమానులు ఈ కొత్త మోడల్‌ను ఎంతవరకు ఆదరిస్తారో వేచి చూడాలి.