bajaj Auto: విదేశీ మార్కెట్లలో బజాజ్ దూకుడు.. మే నెలలో ఎగుమతులు 34% వృద్ధి!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం 'బబాజ్ ఆటో' 2026 మే నెలలో బలమైన అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతుల విభాగంలో పెరిగిన డిమాండ్‌తో కంపెనీ మొత్తం 4,61,257 వాహనాలను విక్రయించింది. గతేడాది మే నెలలో విక్రయించిన 3,84,621 యూనిట్లతో పోలిస్తే ఇది 20 శాతం వృద్ధి కావడం విశేషం.
వివరాలు
ద్విచక్ర వాహనాలే ప్రధాన బలం
బజాజ్ ఆటో అమ్మకాలలో ద్విచక్ర వాహనాల విభాగం కీలక పాత్ర పోషించింది. 2026 మేలో కంపెనీ మొత్తం 3,93,204 ద్విచక్ర వాహనాలను విక్రయించగా, 2025 మేలో ఈ సంఖ్య 3,32,370 యూనిట్లుగా ఉంది. దీంతో ఈ విభాగంలో 18 శాతం వృద్ధి నమోదైంది. దేశీయ మార్కెట్లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 2,09,528 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో విక్రయించిన 1,91,412 యూనిట్లతో పోలిస్తే 9 శాతం పెరుగుదల నమోదైంది. బజాజ్ మోటార్‌సైకిళ్లకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ కొనసాగుతోంది.
వివరాలు
ఎగుమతుల్లో 30 శాతం జంప్
అంతర్జాతీయ మార్కెట్లలో బజాజ్ ఆటోకు మరింత ఆదరణ లభిస్తోంది. మే నెలలో కంపెనీ 1,83,676 ద్విచక్ర వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఎగుమతి చేసిన 1,40,958 యూనిట్లతో పోలిస్తే ఇది 30 శాతం వృద్ధి. ఎగుమతులే ప్రధాన వృద్ధి ఇంజిన్ ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలను కలిపి కంపెనీ మొత్తం ఎగుమతులు 2,13,226 యూనిట్లకు చేరాయి. 2025 మేలో నమోదైన 1,58,888 యూనిట్లతో పోలిస్తే ఇది 34 శాతం పెరుగుదల. విదేశీ మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్ బజాజ్ ఆటో వ్యాపార విస్తరణకు కీలకంగా మారింది.
వివరాలు
కమర్షియల్ వాహనాల విభాగంలోనూ దూకుడు
వాణిజ్య వాహనాల విక్రయాల్లో కూడా బజాజ్ ఆటో అద్భుత ప్రదర్శన కనబరిచింది. మే నెలలో మొత్తం కమర్షియల్ వాహనాల అమ్మకాలు 68,053 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో 52,251 యూనిట్లు విక్రయించగా, ఈసారి 30 శాతం వృద్ధి నమోదైంది. దేశీయంగా కమర్షియల్ వాహనాల విక్రయాలు 38,503 యూనిట్లకు చేరి 12 శాతం పెరిగాయి. మరోవైపు ఎగుమతులు 65 శాతం వృద్ధితో 29,550 యూనిట్లకు చేరడం గమనార్హం. ఇది కంపెనీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో ఒకటిగా నిలిచింది.
వివరాలు
ఏప్రిల్-మేలో 30 శాతం వృద్ధి
2026-27 ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు నెలలు (ఏప్రిల్-మే) కంపెనీకి అత్యంత విజయవంతంగా నిలిచాయి. ఈ కాలంలో మొత్తం 9,75,049 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 7,50,431 యూనిట్లతో పోలిస్తే 30 శాతం వృద్ధి సాధించింది. సానుకూలంగా ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరం మోటార్‌సైకిళ్లకు పెరుగుతున్న డిమాండ్, బలమైన ఎగుమతులు, కమర్షియల్ వాహనాల అమ్మకాలలో వృద్ధి బజాజ్ ఆటోకు కొత్త ఆర్థిక సంవత్సరంలో శుభారంభాన్ని అందించాయి. ఇదే జోరు కొనసాగితే 2026-27లో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మరో విజయవంతమైన ఏడాదిని నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.