Page Loader
Renault Triber Facelift: అఫార్డిబుల్​ 7 సీటర్ ఫ్యామిలీ కారు.. రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ రేపు ప్రారంభం! 
రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ రేపు ప్రారంభం!

Renault Triber Facelift: అఫార్డిబుల్​ 7 సీటర్ ఫ్యామిలీ కారు.. రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ రేపు ప్రారంభం! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2025
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మార్కెట్‌లో బెస్ట్ 7 సీటర్ ఫ్యామిలీ కార్లలో రెనాల్ట్ ట్రైబర్ ప్రముఖంగా నిలుస్తోంది. 2019లో ఈ మోడల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సంస్థ ఎలాంటి ముఖ్యమైన అప్డేట్లు ఇవ్వలేదు. అయితే ఇప్పుడు,రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌ను జూలై 23న భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. లాంచ్‌కు ముందే ఈ అఫార్డబుల్ ఎంపీవీకి సంబంధించి టీజర్ విడుదల చేసింది సంస్థ. అంతేకాకుండా,సరికొత్త రెనాల్ట్ లోగోను కూడా పరిచయం చేసింది. ఈ లోగోను ట్రైబర్‌తో పాటు భవిష్యత్తులో విడుదలయ్యే అన్ని మోడళ్లపై ఉపయోగించనున్నారు. ప్రస్తుత లోగోతో పోలిస్తే కొత్త లోగో మరింత ఆకర్షణీయంగా,ఆధునికంగా కనిపిస్తోంది. ఇది రాబోయే వాహనాలకు కొత్తదనాన్ని అందించనుందని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో 2025 రెనాల్ట్ ట్రైబర్‌కు సంబంధించిన లభ్యమైన వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

వివరాలు 

రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్: ఎక్స్‌టీరియర్ డిజైన్ 

తాజాగా బయటపడిన స్పై షాట్స్ ప్రకారం.. 2025 రెనాల్ట్ ట్రైబర్ ఎక్స్‌టీరియర్ రూపకల్పనలో ముఖ్యమైన మార్పులు జరిగే అవకాశం ఉంది. రాబోయే మోడల్లో రీఫ్రెష్ చేయబడిన ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు (డీఆర్‌ఎల్) ఉండబోతున్నాయని, ప్రధాన హెడ్‌లైట్ యూనిట్లను స్వల్పంగా మళ్లీ డిజైన్ చేసినట్లు అంచనా. ముందుభాగంలోని బంపర్ పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లు, స్థానం మార్చిన ఫాగ్ ల్యాంప్‌లతో కొత్త లుక్కు పొందనుంది. బైహత్తుగా చూసినప్పుడు రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ సైడ్ భాగంలో కొత్త అలాయ్ వీల్ డిజైన్‌లు చూడవచ్చు. వెనక భాగంలో రీడిజైన్ చేసిన బంపర్, మరింత ఆకర్షణీయంగా మారిన టెయిల్ ల్యాంప్ సెటప్ కనిపించే అవకాశం ఉంది.

వివరాలు 

రెనాల్ట్ కొత్త లోగో ఇదిగో.. 

ఈసారి సంస్థ సరికొత్త రెనాల్ట్ లోగోను పరిచయం చేసింది. ఈ కొత్త లోగోను రెనాల్ట్ ట్రైబర్‌తో పాటు రాబోయే అన్ని వాహనాల్లో అమర్చనున్నారు. రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ -ఇంటీరియర్, ఫీచర్లు 2025 రెనాల్ట్ ట్రైబర్ ఇంటీరియర్‌లో ప్రస్తుతం ఉన్నమోడల్‌ డిజైన్‌ను కొనసాగించే అవకాశం ఉంది. అయితే కొన్ని మార్పులు ఉండవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా సీట్ల అప్హోల్స్టరీను నవీకరించే అవకాశం ఉండగా,డాష్‌బోర్డ్ డిజైన్‌లో కూడా స్వల్ప మార్పులు ఉండే అవకాశముంది. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్లో యాంబియెంట్ లైటింగ్, సవరించిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్,ఆటో-డిమ్మింగ్ రియర్‌వ్యూ మిర్రర్,360 డిగ్రీ కెమెరా,కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఆటోమేటిక్ హెడ్‌లాంప్‌లు వంటి పలు కొత్త ఫీచర్లను అందించవచ్చని భావిస్తున్నారు.

వివరాలు 

రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ - ఇంజిన్, పనితీరు 

ఇవన్నీ కలిపి ఈ 7సీటర్ ఫ్యామిలీ ఎంపీవీని మరింత ప్రీమియం లుక్కుతో పాటు కాంపిటీటివ్‌గా నిలిపే అవకాశం ఉంది. ఇంజిన్ పరంగా రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.ఇప్పటి మాదిరిగానే 1.0 లీటర్ 3 సిలిండర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో కొనసాగుతుందని అంచనా. ఇది 72 హెచ్‌పీ పవర్, 96 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. అదనంగా,ఎక్కువ శక్తివంతమైన 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా లైనప్‌లో చేర్చే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలున్నా,ఇది ఫేస్‌లిఫ్టెడ్ మోడల్‌లో వస్తుందా లేదా అనే విషయంలో రెనాల్ట్ నుంచి ఇంకా స్పష్టమైన సమాచారం లేదు.

వివరాలు 

2025 రెనాల్ట్ ట్రైబర్ ధర అంచనాలు 

ఈ ఇంజన్ 100 హెచ్‌పీ పవర్, 160 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది. ఇది మాన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో రావొచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న రెనాల్ట్ ట్రైబర్ ధర రూ. 6.15 లక్షల నుంచి రూ. 8.98 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కొత్త ఫేస్‌లిఫ్ట్‌తో ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ధరలు పెరిగినా, ట్రైబర్ భారతదేశంలో అత్యంత అఫార్డబుల్ 7 సీటర్ ఫ్యామిలీ ఎంపీవీగా కొనసాగుతుందని అంచనా.