NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Eblu Feo X: ఫ్యామిలీ కోసం బెస్ట్ EV స్కూటర్.. 5-ఇయర్స్ వారంటీ, అద్భుతమైన ఫీచర్లు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Eblu Feo X: ఫ్యామిలీ కోసం బెస్ట్ EV స్కూటర్.. 5-ఇయర్స్ వారంటీ, అద్భుతమైన ఫీచర్లు
    ఫ్యామిలీ కోసం బెస్ట్ EV స్కూటర్.. 5-ఇయర్స్ వారంటీ, అద్భుతమైన ఫీచర్లు

    Eblu Feo X: ఫ్యామిలీ కోసం బెస్ట్ EV స్కూటర్.. 5-ఇయర్స్ వారంటీ, అద్భుతమైన ఫీచర్లు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 11, 2025
    11:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVs) క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది.

    పెట్రోల్ ధరల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వల్ల ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ టూవీలర్ల వైపు ఆకర్షితులవుతున్నారు.

    ప్రస్తుతం మార్కెట్లో హీరో, బజాజ్, ఓలా, ఏథర్ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉనికిని కొనసాగిస్తున్నాయి.

    అయితే వీటికి పోటీగా చిన్న కంపెనీలు కూడా తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తూ మార్కెట్‌ను ఆకర్షిస్తున్నాయి.

    Details

    ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999

    ఈ నేపథ్యంలో దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ తన కొత్త మోడల్ Eblu Feo Xని భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

    స్కూటర్‌ను 2024లో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించగా, మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచే మంచి ఆదరణను అందుకుంది.

    ఇప్పుడు, 2025లో ఈ స్కూటర్ కొత్త వెర్షన్‌తో లాంచ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 99,999 ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులోకి తెచ్చారు.

    ఈ స్కూటర్ పాంటోన్ బ్లూ, వైన్ రెడ్, జెట్ బ్లాక్, టెలిగ్రే, ట్రాఫిక్ వైట్ వంటి ఐదు రంగుల్లో లభిస్తుంది.

    Details

     Eblu Feo X ప్రత్యేకతలు 

    7.4-అంగుళాల మల్టీ-కలర్ TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్

    బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్, టైప్-C USB ఛార్జింగ్ పోర్ట్

    పూర్తిగా LED లైటింగ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ సెటప్

    కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS), డిస్క్ బ్రేక్‌లు

    28 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం

    12-అంగుళాల ట్యూబ్‌లెస్ అల్లాయ్ వీల్స్

    ఎకో, నార్మల్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్స్, అదనంగా రివర్స్ మోడ్

    Details

     బ్యాటరీ & మైలేజ్ 

    2.36 kWh బ్యాటరీ ప్యాక్ - టాప్ స్పీడ్: 60 kmph

    ఫుల్ ఛార్జ్‌పై 110 కి.మీ రేంజ్

    60V హోమ్ ఛార్జర్‌తో 5 గంటల 25 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది

    5 సంవత్సరాల లేదా 50,000 కి.మీ వారంటీ ప్రస్తుతం Eblu Feo X స్కూటర్‌కు ప్రీ-ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయని సమాచారం.

    టాప్-క్లాస్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, మంచి బ్యాటరీ సామర్థ్యంతో ఈ స్కూటర్ EV మార్కెట్లో మరింత విజయాన్ని సాధించే అవకాశముంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎలక్ట్రిక్ స్కూటర్

    తాజా

    Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు వీరేంద్ర సెహ్వాగ్
    Vikram Misri: పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    Pakistan: భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య.. ఆర్థిక సహాయం కోసం పంచ బ్యాంకు'ను సంప్రదించిన పాకిస్తాన్  పాకిస్థాన్
    Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం  ఒమర్ అబ్దుల్లా

    ఎలక్ట్రిక్ స్కూటర్

    Zelio X Men 2.0: 6.75 రూపాయలకే 100కిలోమీటర్లు పరుగెత్తగలిగే ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్! ధర ఎంతంటే..? ఆటోమొబైల్స్
    Honda Activa ev: భారతదేశంలో హోండాActiva e, QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ల ఆవిష్కరణ.. రేంజ్, ఫీచర్లు తెలిస్తే మతిపోవాల్సిందే! ఆటో మొబైల్
    Electric scooter : కోమాకి వెనిస్.. ఫ్యామిలీ సేఫ్టీకి ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్! ఆటో మొబైల్
    Bajaj Chetak: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలు.. సంచలన నిర్ణయం తీసుకున్న కంపెనీ ఆటోమొబైల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025