Page Loader
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 650cc మోడల్స్.. ధరలు ఎలా ఉన్నాయంటే?
రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 650cc మోడల్స్.. ధరలు ఎలా ఉన్నాయంటే?

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 650cc మోడల్స్.. ధరలు ఎలా ఉన్నాయంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 18, 2023
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

లగ్జరీ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) అత్యంత డిమాండ్ ఉన్న బ్రాండ్లలో ఒకటిగా మారింది. ఇప్పటికే రాయల్ ఎన్‌ఫీల్డ్ 50cc J-సిరీస్, ఐకానిక్ 650cc ప్యారలల్-ట్విన్ ఇంజన్‌ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా బైక్‌మేకర్ ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650, సూపర్ మెటోర్ 650, షాట్‌గన్ 650 పరిచయం చేసి, తన ఉనికిని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటర్‌సెప్టర్ 650 అనేది రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు అత్యంత అందుబాటులో ఉండే 650cc మోడల్‌గా నిలిచింది. దీని ధర రూ. రూ. 3.03 లక్షల నుంచి రూ. 3.31 లక్షలు ఉంది. ఇందులో టియర్‌డ్రాప్-ఆకారపు ఇంధన ట్యాంక్, LED హెడ్‌ల్యాంప్, ఎత్తైన హ్యాండిల్‌బార్, సింగిల్-పీస్ సీటు వంటి ఫీచర్లు ఉన్నాయి.

Details

ఇంటర్‌సెప్టర్ 650లో అధునాతన ఫీచర్లు

ప్రయాణికుల భద్రత కోసం డ్యూయల్-ఛానల్ ABSతో పాటు రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. స్పోర్టీ కాంటినెంటల్ GT 650 ధర రూ. 3.19 లక్షల నుంచి రూ. 3.45 లక్షలు ఉంది. ఇందులో మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, వృత్తాకార LED హెడ్‌లైట్, క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్, వైర్-స్పోక్డ్ లేదా అల్లాయ్ వీల్స్, రైడర్-ఓన్లీ శాడిల్, డ్యూయల్ ఎగ్జాస్ట్‌లు, సెమీ-డిజిటల్ ట్విన్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి. సూపర్ మెటోర్ 650 ధర రూ. 3.61 లక్షల నుంచి రూ. 3.91 లక్షలు ఉంది. ఈ బైకులో LED హెడ్‌ల్యాంప్, విస్తృత హ్యాండిల్‌బార్, సర్దుబాటు చేయగల లివర్లు, పొడవైన విండ్‌స్క్రీన్, డ్యూయల్ సైడ్-మౌంటెడ్ ఎగ్జాస్ట్‌లు, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.