LOADING...
BMW 5 Series: పానోరామిక్ గ్లాస్‌రూఫ్‌తో BMW 5 సిరీస్.. ప్రీమియం సెడాన్‌లో కొత్త ఊపు
పానోరామిక్ గ్లాస్‌రూఫ్‌తో BMW 5 సిరీస్.. ప్రీమియం సెడాన్‌లో కొత్త ఊపు

BMW 5 Series: పానోరామిక్ గ్లాస్‌రూఫ్‌తో BMW 5 సిరీస్.. ప్రీమియం సెడాన్‌లో కొత్త ఊపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 13, 2025
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మార్కెట్లో బిఎండబ్ల్యూ (BMW) తన ప్రీమియం ఎగ్జిక్యూటివ్ సెడాన్ 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్ (LWB) మోడల్‌ను మరిన్ని కొత్త ఫీచర్లతో తాజాగా అప్‌డేట్ చేసింది. ఈ అప్‌డేట్‌లో పలు అధునాతన సదుపాయాలను జోడించినప్పటికీ, ధరను మాత్రం యథాతథంగా కొనసాగించడం గమనార్హం. ప్రస్తుతం ఈ లగ్జరీ సెడాన్ ధర రూ.73.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)గానే ఉంది. 3 సిరీస్‌, 7 సిరీస్‌ల మధ్య స్థానం దక్కించుకున్న ఈ కార్‌.. భారత మార్కెట్లో మెర్సిడెస్-బెంజ్ ఈ-క్లాస్‌, ఆడి ఏ6 వంటి ప్రీమియం సెడాన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ తాజా అప్‌డేట్‌లో ప్రధాన ఆకర్షణగా పానోరామిక్ గ్లాస్‌రూఫ్ స్కై లౌంజ్ ఫీచర్‌ను బీఎండబ్ల్యూ అందుబాటులోకి తీసుకొచ్చింది.

Details

మరింత విశాలంగా క్యాబిన్

ఇది కార్ రూఫ్ అంతా విస్తరించే భారీ గ్లాస్ ప్యానల్‌తో పాటు అధునాతన ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ లైటింగ్ కార్‌లోని అంబియంట్ లైటింగ్‌తో సమన్వయంగా పనిచేస్తూ క్యాబిన్‌కు మరింత లగ్జరీ, ప్రీమియం ఫీల్‌ను అందిస్తుంది. పగటి వేళల్లోనూ గ్లాస్‌రూఫ్ డిజైన్ స్పష్టంగా కనిపించేలా రూపొందించడంతో క్యాబిన్ మరింత విశాలంగా, ఆహ్లాదకరంగా అనిపించేలా మారింది. భద్రత, టెక్నాలజీ పరంగా కూడా బీఎండబ్ల్యూ కీలక మార్పులు చేసింది. తాజా మోడల్‌లో డ్రైవింగ్ అసిస్టెంట్ ప్లస్ ఫీచర్‌ను జోడించారు. దీని ద్వారా అదనపు యాక్టివ్ సేఫ్టీ సిస్టమ్స్‌తో పాటు సెమీ-ఆటోమేటెడ్ డ్రైవింగ్ సపోర్ట్ లభిస్తుంది.

Details

ధరలో ఎలాంటి మార్పులు లేదు

ఇది డ్రైవర్‌కు మరింత సౌకర్యాన్ని అందించడమే కాకుండా, ప్రయాణికుల భద్రతను కూడా గణనీయంగా పెంచుతుంది. ఆధునిక సాంకేతికతతో పాటు సురక్షిత ప్రయాణం లక్ష్యంగా ఈ అప్‌డేట్‌ను తీసుకొచ్చినట్లు బీఎండబ్ల్యూ పేర్కొంది. ఫీచర్లు పెరిగినప్పటికీ, వేరియంట్లు లేదా ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. బీఎండబ్ల్యూ ప్రస్తుతం ఈ కారును భారత మార్కెట్లో 530Li M Sport అనే ఒక్క వేరియంట్‌లోనే విక్రయిస్తోంది. కొత్త ఫీచర్లు, లగ్జరీ డిజైన్‌, ఆధునిక భద్రతా వ్యవస్థలతో అప్‌డేట్ అయిన బీఎండబ్ల్యూ 5 సిరీస్ LWB.. ప్రీమియం సెడాన్ సెగ్మెంట్‌లో మరింత బలమైన పోటీదారుగా నిలవనుంది.

Advertisement