BMW Alpina Vision Concept: బీఎండబ్ల్యూ ఆల్పినా విజన్ కాన్సెప్ట్ ఆవిష్కరణ.. టాప్ 5 హైలైట్స్ ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన ఆధీనంలోకి వచ్చిన Alpina బ్రాండ్ భవిష్యత్ దిశను చూపిస్తూ కొత్త 'BMW ఆల్పినా విజన్ కాన్సెప్ట్' కారును ఆవిష్కరించింది. ఇటలీలో జరిగిన ప్రతిష్ఠాత్మక కాంకోర్సో డి ఎలెగాంజా విల్లా డి ఎస్టే ఈవెంట్‌లో ఈ లగ్జరీ గ్రాండ్ టూరర్‌ను ప్రదర్శించారు. ఈ కాన్సెప్ట్ మోడల్ భవిష్యత్తులో రాబోయే అల్పినా కార్ల డిజైన్, లగ్జరీ స్థాయిని ప్రతిబింబిస్తోంది. BMW సాధారణ మోడళ్ల కంటే ప్రీమియంగా, అయితే రోల్స్ రాయిస్ కంటే కాస్త దిగువ స్థాయిలో ఈ బ్రాండ్‌ను నిలబెట్టాలని కంపెనీ భావిస్తోంది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందే తొలి ప్రొడక్షన్ కారు 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.
వివరాలు
ఆకట్టుకునే ఎక్స్‌టీరియర్ డిజైన్
అది బీఎండబ్ల్యూ 7 Series ఆధారంగా తయారయ్యే అవకాశముందని సమాచారం. బీఎండబ్ల్యూ అల్పినా విజన్ కాన్సెస్ట్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశం దీని గ్రాండ్ టూరర్ స్టైలింగ్. 5.2 మీటర్లకు పైగా పొడవున్న ఈ లగ్జరీ కూపేలో 2+2 సీటింగ్ లేఅవుట్, పొడవైన బోనెట్, లో-స్లంగ్ స్టాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముందుభాగంలో అల్పినా బ్రాండ్‌కు గుర్తుగా నిలిచిన 'షార్క్ నోస్' డిజైన్‌ను కొనసాగించారు. అలాగే ఐకానిక్ BMW 507 నుంచి ప్రేరణ పొందిన స్లిమ్ ఇల్యూమినేటెడ్ కిడ్నీ గ్రిల్‌ను అమర్చారు.
వివరాలు
వెనుక భాగంలో 23 అంగుళాల వీల్స్
క్రిస్టల్ డీటైలింగ్‌తో కూడిన సన్నని LED హెడ్‌ల్యాంప్స్, వార్మ్ వైట్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ ఈ కారుకు మరింత ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి. అల్పినా బ్రాండ్‌కు ప్రత్యేకమైన డెకో స్ట్రైప్స్, ప్రత్యేక చిన్ స్పాయిలర్, మల్టీ-స్పోక్ అలాయ్ వీల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ముందు భాగంలో 22 అంగుళాల వీల్స్, వెనుక భాగంలో 23 అంగుళాల వీల్స్‌ను అమర్చారు. వెనుక భాగంలో స్లిమ్ టెయిల్ ల్యాంప్స్‌తో పాటు బంపర్‌లో ఇంటిగ్రేట్ చేసిన క్వాడ్ ఎగ్జాస్ట్ టిప్స్ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
వివరాలు
లగ్జరీతో నిండిన ఇంటీరియర్
ఇంటీరియర్ విషయంలో కూడా బీఎండబ్ల్యూ అత్యంత లగ్జరీ ఫీల్‌పై దృష్టి పెట్టింది. డ్యుయల్ టోన్ క్యాబిన్‌లో ఫుల్ గ్రెయిన్ లెదర్, ఓపెన్ పోర్ వుడ్, మెషిన్డ్ మెటల్ ఫినిష్‌లను ఉపయోగించారు. డ్యాష్‌బోర్డ్‌పై బీఎండబ్ల్యూ తాజా పనోరమిక్ ఐడ్రైవ్ సిస్టమ్‌తో పాటు విండ్షీల్డ్ దగ్గర పూర్తి వెడల్పుతో డిస్‌ప్లేను అమర్చారు. రోంబాయిడ్ ఆకారంలోని ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, ప్రయాణికుడి కోసం ప్రత్యేక డిస్‌ప్లే కూడా ఇందులో ఉన్నాయి. ఇవి అప్‌డేటెడ్ 7 సిరీస్‌ను గుర్తు చేస్తాయి. ఇక ఈ కాన్సెప్ట్‌లో ప్రత్యేక ఆకర్షణగా రియర్ సెంటర్ కన్సోల్‌లో దాచిన మాగ్నెటిక్ హోల్డర్ల సహాయంతో బయటకు వచ్చే క్రిస్టల్ గ్లాసెస్‌ను అందించారు.
వివరాలు
V8 ఇంజిన్‌తోనే రానున్న అల్పినా
ప్రస్తుతం అనేక లగ్జరీ బ్రాండ్లు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేస్తున్నా.. BMW ఆల్పినా విజన్ కాన్సెస్ట్ మాత్రం శక్తివంతమైన V8 ఇంజిన్‌ను కొనసాగిస్తోంది. ఈ కాన్సెప్ట్‌లో ఫ్రంట్ మౌంటెడ్ V8 పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగించినట్లు బీఎండబ్ల్యూ వెల్లడించింది. అయితే పూర్తి సాంకేతిక వివరాలను ఇంకా ప్రకటించలేదు. భవిష్యత్తులో వచ్చే ప్రొడక్షన్ మోడల్‌లో 4.4 లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్ ఉండొచ్చని సమాచారం. ఇందులో హైబ్రిడ్ సపోర్ట్ ఉండకపోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. అల్పినా బ్రాండ్‌కు ప్రత్యేకమైన ఎగ్జాస్ట్ సౌండ్‌ను అందించేలా ఇంజిన్ ట్యూనింగ్ చేసినట్లు BMW తెలిపింది.
వివరాలు
అల్పినా భవిష్యత్తుపై సంకేతాలు
2026లో అల్పినా బ్రాండ్‌పై పూర్తి నియంత్రణను BMW చేపట్టిన తర్వాత ఈ విజన్ కాన్సెప్ట్ ఎంతో కీలకంగా మారింది. భవిష్యత్తులో వచ్చే అల్పినా మోడళ్లు మరింత లగ్జరీ-ఫోకస్‌తో రూపొందించి మై బ్యాచ్ వంటి ప్రీమియం బ్రాండ్లకు పోటీగా నిలబెట్టాలని కంపెనీ భావిస్తోంది. అలాగే అల్పినా బ్రాండ్‌కు గుర్తింపు తీసుకొచ్చిన దీర్ఘదూర ప్రయాణ సౌకర్యాన్ని కొనసాగించేందుకు ప్రత్యేక కంఫర్ట్ ప్లస్ సస్పెన్షన్ సెటప్‌ను కూడా భవిష్యత్ మోడళ్లలో కొనసాగించనున్నట్లు BMW స్పష్టం చేసింది. త్వరలో మరిన్ని అల్పినా మోడళ్లు BMW ఆల్పినా విజన్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందే తొలి ప్రొడక్షన్ మోడల్ 2027లో మార్కెట్లోకి రానుంది. ఇదే కాకుండా భవిష్యత్తులో BMW X7 SUVకూ అల్పినా ట్రీట్‌మెంట్ ఇవ్వనున్నట్లు బీఎండబ్య్లూ ఇప్పటికే ప్రకటించింది.