LOADING...
BMW Z4: BMW Z4కు గుడ్‌బై.. ఫైనల్ ఎడిషన్'తో అధికారిక వీడ్కోలు
BMW Z4కు గుడ్‌బై.. ఫైనల్ ఎడిషన్'తో అధికారిక వీడ్కోలు

BMW Z4: BMW Z4కు గుడ్‌బై.. ఫైనల్ ఎడిషన్'తో అధికారిక వీడ్కోలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2025
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా బీఎండబ్ల్యూ Z4 కి ముగింపు పలికింది. ఈ ప్రముఖ రోడ్‌స్టర్‌కు వీడ్కోలు చెబుతూ, కంపెనీ Z4 M40i ఆధారంగా ప్రత్యేకమైన 'ఫైనల్ ఎడిషన్'ను పరిమిత సంఖ్యలో అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో రెండు ట్రాన్స్‌మిషన్ ఎంపికలు ఉన్నాయి. ఎనిమిది స్పీడ్ స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, మరోటి ఆరు-స్పీడ్ మాన్యువల్. మాన్యువల్ మోడల్‌లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన 'ఎడిషన్ హాండ్షాల్టర్' ప్యాకేజ్ ఉంటుంది. ఇందులో రియర్ డాంపర్లు, స్టీరింగ్, ట్రాక్షన్ కంట్రోల్, ఎం స్పోర్ట్ డిఫరెన్షియల్ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సెట్టింగులు ఇస్తున్నారు. ఫైనల్ ఎడిషన్ పనితీరులో 3.0 లీటర్ల టర్బోచార్జ్డ్ ఇన్‌లైన్-సిక్స్ ఇంజిన్ పనిచేస్తుంది. ఇది 382 హెచ్‌పీ పవర్, 500 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

వివరాలు 

క్యాబిన్‌లో కూడా ప్రత్యేకత

కారులో ముందుభాగంలో 19-అంగుళాలు, వెనుకభాగంలో 20-అంగుళాల డ్యూయల్-స్పోక్ బైకాలర్ 800ఎం వీల్స్ ఉంటాయి. బీఎండబ్ల్యూ ఇండివిడ్యువల్ ఫ్రోజెన్ బ్లాక్ మెటాలిక్ పేయింట్‌తో పాటు స్టాండర్డ్ షాడోలైన్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. దీని వల్ల మిర్రర్ క్యాప్స్, కిడ్నీ గ్రిల్, లోయర్ ఎయిర్ ఇన్‌టేక్, ఎగ్జాస్ట్ ఫినిషర్లు గ్లోస్-బ్లాక్ లుక్‌తో కనిపిస్తాయి. క్యాబిన్‌లో కూడా ప్రత్యేకతను కొనసాగించారు. ఇన్‌స్ట్రుమెంట్ ప్యానల్, సెంటర్ కన్సోల్, ఫ్లోర్ మ్యాట్స్, డోర్ ప్యానెల్స్, ఎం స్పోర్ట్ సీట్లపై ఎరుపు రంగు స్టిచింగ్‌తో డిజైన్ చేశారు. సీట్లను బ్లాక్ వెర్నాస్కా లెదర్ మరియు అల్కాంటారా మెటీరియల్‌తో తయారు చేశారు. అదనంగా, డోర్ సిల్ ప్లేట్స్‌లో 'Z4 Final Edition' అనే ప్రత్యేక గుర్తింపును ఇచ్చారు.

వివరాలు 

Z4పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయని బీఎండబ్ల్యూ

ఫైనల్ ఎడిషన్‌లో డ్రైవర్ అసిస్టెన్స్ ప్యాకేజ్,హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్,ప్రీమియం ప్యాకేజ్ వంటి స్టాండర్డ్ ఫీచర్లు ఉంటాయి. ఇవి అంబియంట్ లైటింగ్,హెడ్-అప్ డిస్‌ప్లే వంటి సౌకర్యాలను అందిస్తాయి. బీఎండబ్ల్యూ ఈ ప్రత్యేక మోడల్‌ను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు చాలా పరిమిత సంఖ్యలో తయారు చేయనున్నట్టు తెలిపింది. ఏ ట్రాన్స్‌మిషన్ తీసుకున్నా,ఒక్కో కారు ధర 78,675డాలర్లు (డెస్టినేషన్ చార్జ్ 1,175డాలర్లు కలిపి)గా నిర్ణయించారు. Z4రోడ్‌స్టర్ భవిష్యత్తు మాత్రం ఇంకా స్పష్టంగా లేదు. టయోటా సుప్రా..ఇది Z4తో ప్లాట్‌ఫారమ్‌ను పంచుకుంటుంది. వచ్చే మార్చ్‌లోనే తయారీని ఆపేస్తుండగా,టయోటా మాత్రం దీని తరువాతి మోడల్‌పై ఇప్పటికే ప్రణాళికలను వెల్లడించింది. కానీ బీఎండబ్ల్యూ మాత్రం నాలుగో తరం Z4పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.