Loading...
BMW F 450 GS Sport: ట్విన్‌ సిలీండర్‌ బీఎండబ్ల్యూ ఎఫ్‌ 450 స్పోర్ట్స్‌బైక్‌ లాంచ్
ట్విన్‌ సిలీండర్‌ బీఎండబ్ల్యూ ఎఫ్‌ 450 స్పోర్ట్స్‌బైక్‌ లాంచ్

BMW F 450 GS Sport: ట్విన్‌ సిలీండర్‌ బీఎండబ్ల్యూ ఎఫ్‌ 450 స్పోర్ట్స్‌బైక్‌ లాంచ్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 07, 2026
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

అడ్వెంచర్ బైక్ కొనాలని చూస్తున్న వారికి BMW Motorrad మరో కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. భారత మార్కెట్లో బిఎండబ్ల్యూ F 450 GS Sport వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ధరను రూ.5.90 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న Exclusive వేరియంట్ కంటే ఇది రూ.35,000 ఎక్కువ కాగా, టాప్-స్పెక్ GS Trophy కంటే రూ.25,000 తక్కువ. అంటే ప్రీమియం ఫీచర్లు కావాలి కానీ టాప్ వేరియంట్ కోసం అదనంగా ఖర్చు చేయకూడదనుకునే వారికి ఈ కొత్త మోడల్ సరైన మధ్యస్థ ఎంపికగా నిలుస్తుంది. ఇలాంటి బైక్‌లో ధరతో పాటు ఫీచర్లు కూడా తప్పకుండా చూడాలి.

Details

Racing Red కలర్‌లో స్పోర్టీ లుక్

F 450 GS Sport ప్రత్యేకంగా Racing Red కలర్‌లో మాత్రమే లభిస్తుంది. డార్క్ రెడ్, బ్లాక్ బేస్‌తో పాటు వైట్, గ్రే గ్రాఫిక్స్ బైక్‌కు మరింత స్పోర్టీ రూపాన్ని ఇస్తాయి.

ఫ్రంట్ కౌల్, ఫ్యూయల్ ట్యాంక్, రియర్ సైడ్ ప్యానెల్స్‌పై రెడ్ కలర్ హైలైట్‌గా కనిపిస్తుంది. మిగతా భాగాలకు బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వడంతో మొత్తం డిజైన్ ఆకట్టుకునేలా ఉంది.

చూడగానే ఇది సాధారణ అడ్వెంచర్ బైక్ కాదనే ఫీల్ వచ్చేలా BMW డిజైన్ చేసింది.

Details

GS Trophy ఫీచర్లు.. ERC మాత్రం లేదు

కొత్త Sport వేరియంట్‌లో GS Trophyకి దగ్గరగా ఉండే పలు ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

అడ్జస్టబుల్ స్పోర్ట్స్ సస్పెన్షన్, Gear Shift Assistant Pro, ఆఫ్‌రోడ్ ఫుట్‌రెస్ట్స్, క్లియర్ విండ్‌షీల్డ్, హ్యాండ్ ప్రొటెక్షన్ వంటి సదుపాయాలు లభిస్తాయి.

Riding Modes Pro, Enduro Pro మోడ్‌లు కూడా ఉన్నాయి. అయితే GS Trophyలో మాత్రమే ఉండే Easy Ride Clutch (ERC)ను Sportలో ఇవ్వలేదు.

ERC అవసరం లేని రైడర్లకు ఈ మినహాయింపు పెద్ద సమస్య కాకపోవచ్చు. బైక్ కొనేముందు ఈ తేడాను గుర్తుంచుకోవాలి.

ADVERTISEMENT

Details

420cc ఇంజిన్.. 48 hp పవర్

BMW F 450 GS Sportలో 420cc ట్విన్-సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 48 hp పవర్, 43 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఇంజిన్ పనిచేస్తుంది. Rain, Road, Enduro రైడింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.

స్టీల్ ట్యూబ్ ఫ్రేమ్, 43mm USD ఫ్రంట్ ఫోర్కులు, రియర్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. ముందు, వెనుక డిస్క్ బ్రేకులతో పాటు ABS Pro కూడా లభిస్తుంది.

ADVERTISEMENT

Details

టెక్నాలజీ విషయంలోనూ తగ్గేదేలే

ఫీచర్ల పరంగా కూడా Sport వేరియంట్‌ను BMW బలంగా రూపొందించింది.

Ride-by-Wire, Anti-Hopping Clutch, Dynamic Traction Control (DTC), Dynamic Engine Brake Control (MSR) వంటి టెక్నాలజీలు ఉన్నాయి. 6.5 ఇంచుల కలర్ TFT డిస్‌ప్లే, హీటెడ్ గ్రిప్స్, Type-C USB పోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ అందించారు.

క్లచ్, హ్యాండ్ బ్రేక్ లివర్లు, ఫుట్ బ్రేక్ లివర్‌ను కూడా అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, BMW F 450 GS Sportలో ప్రీమియం అడ్వెంచర్ బైక్‌కు అవసరమైన ఫీచర్లు చాలావరకు ఉన్నాయి.

ADVERTISEMENT