BMW M3 CS: మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కొత్త BMW M3 CS.. కార్ లవర్స్‌కు అదిరే ట్రీట్!
ఈ వార్తాకథనం ఏంటి
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ మరోసారి కార్ ప్రియులను ఆకట్టుకునే స్పోర్ట్స్ సెడాన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ తాజాగా BMW M3 CSను "హ్యాండ్షాల్టర్" (Handschalter) అనే ప్రత్యేక మాన్యువల్ వేరియంట్‌లో విడుదల చేసింది. జర్మన్ భాషలో హ్యాండ్షాల్టర్ అంటే మాన్యువల్ షిఫ్ట్ అని అర్థం. ఈ కొత్త మోడల్‌లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను అందించారు. ప్రస్తుతం ఈ కారును అమెరికా, కెనడా మార్కెట్లలో మాత్రమే పరిమిత సంఖ్యలో విక్రయిస్తున్నారు. ఈ కొత్త BMW M3 CS Handschalterలో 3.0 లీటర్ ట్విన్-టర్బో ఇన్‌లైన్-6 S58 ఇంజిన్‌ను ఉపయోగించారు.
వివరాలు
473 హెచ్‌పీ పవర్, 550 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి
ఇది గరిష్టంగా 473 హెచ్‌పీ పవర్, 550 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.1 సెకన్లలో చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 290 కిలోమీటర్లు. సాధారణ M3తో పోలిస్తే ఈ CS వెర్షన్‌లో చాసిస్, సస్పెన్షన్, డ్యాంపింగ్ సెటప్‌ను మరింత స్పోర్టీగా ట్యూన్ చేశారు. డిజైన్ పరంగా కూడా ఈ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొత్త యెల్లో టింట్ LED డే టైమ్ రన్నింగ్ లైట్స్, రెడ్ ట్రిమ్‌తో కూడిన కిడ్నీ గ్రిల్, కార్బన్ ఫైబర్ బాడీ ఎలిమెంట్స్ దీనికి మరింత స్పోర్ట్స్ లుక్‌ను ఇచ్చాయి.
వివరాలు
BMW M3 CS Handschalter ప్రారంభ ధర రూ.1.03 కోట్లు
రూఫ్,బోనెట్,స్ప్లిట్టర్,ORVM కవర్లు,రియర్ స్పాయిలర్ వంటి భాగాల్లో కార్బన్ ఫైబర్ వినియోగించారు. 19అంగుళాల ఫ్రంట్,20అంగుళాల రియర్ ఫోర్జ్డ్ అల్లాయ్ వీల్స్‌ను అందించారు. క్యాబిన్‌లో 14.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. కొత్త M కార్బన్ బకెట్ సీట్లు,16-స్పీకర్ హర్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్,3-జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ట్రాక్ డ్రైవింగ్ కోసం M Drift Analyser,M Laptimer,10-స్టేజ్ M Traction Control వంటి ప్రత్యేక ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నఈ BMW M3 CS Handschalter ప్రారంభ ధర అమెరికాలో 1,07,100డాలర్లు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1.03 కోట్లు అవుతుంది.