బీఎండబ్య్లూ ఎక్స్ఎం వర్సెస్ రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీ: రెండిట్లో ఏదీ బెస్ట్ కారు?
ఈ వార్తాకథనం ఏంటి
రేంజ్ రోవర్ ఎస్వీ కారు వినియోగదారులకు అకర్షిస్తోంది. అత్యాధునిక ఫీచర్లు, టెక్నాలజీ సదుపాయంలో ఇది మార్కెట్లోకి లాంచ్ అయింది.
బీఎండబ్య్లూ ఎక్స్ ఎం, రేంజ్ రోవర్ ఎస్వీ కి గట్టి పోటినిస్తోంది. ఈ రెండు కార్ల పనితీరుపై ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం.
2004లో ప్రారంభమైనప్పటి నుండి రేంజ్ రోవర్ స్పోర్ట్ ప్రజాదరణ పొందింది. ల్యాండ్ రోవర్ మార్కెట్లో విస్తరించడానికి 2015లో స్పోర్టీ SVR మోడల్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే.
రేంజ్ రోవర్ స్పోర్ట్ SV మస్క్యులర్ క్లామ్‌షెల్ హుడ్, బ్లాక్-అవుట్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ DRLలతో స్వెప్ట్-బ్యాక్ LED హెడ్లైట్లు, విశాలమైన ఎయిర్ డ్యామ్, ఇండికేటర్-మౌంటెడ్ ORVMలు, ఫ్లష్-ఫిట్టెడ్ డోర్ హ్యాండిల్స్, ఫ్లార్డ్ వీల్ ఆర్చ్‌లు, 23-అంగుళాల కార్బన్ కలిగి ఉంది.
Details
రేంజ్ రోవర్ స్టోర్ట్ లో అత్యాధునిక ఫీచర్లు
బీఎండబ్య్లూ ఎక్స్ఎం LED హెడ్లైట్లు, టెయిల్‌ల్యాంప్‌లు, ఇల్యూమినేటెడ్ కిడ్నీ గ్రిల్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, 21-అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక డిఫ్యూజర్ ఉన్నాయి.
ఈ రెండు SUVలు హెడ్-అప్ డిస్ప్లే, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్‌ను కలిగి ఉంటాయి.
రేంజ్ రోవర్ స్పోర్ట్ SVలో బకెట్-స్టైల్ ఫ్రంట్ సీట్లు, ప్రీమియం లెదర్ అప్హోల్స్టరీ, హెడ్-అప్ డిస్ప్లే, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఫ్లోటింగ్-టైప్ పివి ప్రో ఇన్ఫోటైన్మెంట్ ప్యానెల్ ఉన్నాయి.
BMW XM రెండు-టోన్ డ్యాష్‌బోర్డ్, వింటేజ్ కాఫీ మెరినో లెదర్ అప్హోల్స్టరీ, హెడ్-అప్ డిస్ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, తాజా iDrive 8 OSతో కూడిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది.