ఎంజీ మోటర్ ఇండియా నుంచి అదిరిపోయే ఎంజీ గ్లోస్టర్ వచ్చేసింది!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటర్ ఇండియా తన ఎస్‌యూవీ గ్లోస్టర్ కొత్త ఎడిషన్ సోమవారం మార్కెట్లోకి లాంచ్ చేసింది.
దీని ధర రూ.40.29 లక్షలు ఉండనుంది. ఈ మోడల్‌లో సరికొత్త ఫీచరలు ఉన్నాయని కంపెనీ స్పష్టం చేసింది.
బ్లాక్ స్మార్మ్ పేరుతో విడుదల చేసి ఈ ఎస్‌యూవీ అడ్వాన్స్‌డ్ గ్లోస్టర్‌లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చామని కంపెనీ వెల్లడించింది.
ముఖ్యంగా 2 లీటర్ ఇంజిన్‌తో వచ్చిన గ్లాస్టర్‌లో మొత్తం 30 కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లు ఉండడం విశేషం.
Details
దేశీయ మార్కెట్లోకి త్వరలో కొత్త కార్లు
స్నో, మడ్, ఎకో, స్పోర్ట్, నార్మల్, రాక్, శాండ్ అనే 7 రకాల డ్రైవింగ్ మోడ్‌లలో ఈ కారును ప్రత్యేకంగా రూపొందించారు. ఎలక్ట్రిక్ సన్ రూఫ్, అడ్జస్టబుల్ డ్రైవర్ స్టీ లాంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఉన్నాయని కంపెనీ ధ్రువీకరించింది.
కంపెనీ ఏడాదికి 1.2లక్షల యూనిట్ల వరకు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఎంజీ మోటర్ ఈవీ విభాగంపై దృష్టి సారించింది.
దేశీయ మార్కెట్లో మరో 4-5 కొత్త కార్లను తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నామని ఎంజీ మోటర్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్ గౌరవ్ గుప్తా తెలియజేశారు.