మహీంద్ర కీలక నిర్ణయం.. ఈ ఏడాది కొత్త లాంచ్‌లకు నో ఛాన్స్?
ప్రస్తుతం దేశ ఆటోమొబైల్ రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. కస్టమర్లు నుంచి కొనుగోళ్లు పెరగడంతో వారిని ఆకర్షించేందుకు కొత్త కొత్త మోడల్స్ ను ఆటో మొబైల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది కీలక నిర్ణయం తీసుకుంది. 2023లో కొత్త లాంచ్‌లు చేయకూడదని డిసైడ్ అయినట్లు సమాచారం. ఎ అండ్ ఎంకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. ఇక ఇండియాలోనూ డిమాండ్ ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎక్స్‌యూవీ 700, థార్, స్కార్పియో-ఎన్, ఎక్స్‌యూవీ 400 ఈవీ వంటి మోడల్స్ కు ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
పెండింగ్ ఉన్న డెలివరీలపై దృష్టి
అందుకు తగ్గట్టుగానే వెయిటింగ్ పీరియడ్స్ భారీగా పెరిగిపోయాయి. ఇక రోజు రోజుకు కొత్త అర్డర్స్ వస్తుంటే అటు డిమాండ్ ఉన్న వాహనాల వెయింట్ పీరియడ్ పెరిగిపోతూ వస్తోంది. అదే విధంగా ప్రొడక్షన్‌లో ఆటంకాలు ఏర్పడటంతో పెద్ద సమస్యగా మారింది. దీంతో కొత్త లాంచ్ లకు వచ్చే ఏడాదికి వాయిదా వేసి, పెండింగ్ లో ఉన్న డెలివరీలపై దృష్టి పెట్టనున్నట్లు ఎం అండ్ ఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది 2.0 లీటర్ ఎం స్టాలియన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్న మహీంద్రా థార్ కు సంబంధించి 58వేల యూనిట్లు, స్కార్పియో ఎన్ కు సంబంధించి 78వేల యూనిట్లు పెండింగ్లో ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కు సంబంధించి 1,17,000 యూనిట్లు డెలివరీ అవ్వాల్సి ఉంది.