మెక్‌లారెన్ ఆర్టురా ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది.. ధరెంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటిష్ సూపర్ కారు మెక్ లారెన్ ఆర్టురా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. సూపర్ లుక్ తో ఉన్న ఈ రేసు కారు వినియోగదారులను ఎంతగానే ఆకట్టుకుంటోంది.
దీని ధర రూ.5.09 కోట్లు ఉండగా.. దీనికి 5 సంవత్సరాల వారంటీ ఉండనుంది. మెక్‌లారెన్ ఆర్టురా బెస్ట్-ఇన్-క్లాస్ కర్బ్ బరువు 1489 కిలోలు ఉంది.
ఈ సూపర్‌కార్‌కు ఇ-మోడ్, కంఫర్ట్, స్పోర్ట్, ట్రాక్ రూపంలో నాలుగు డ్రైవింగ్ మోడ్‌లు ఉండడం విశేషం.
తమ కస్టమర్లకు సరికొత్త టెక్నాలజీ, డిజైన్ తో పాటు మెక్ లారెన్ ఆర్టురాను ఇండియాలో ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉందని చైనా మేనేజింగ్ డైరెక్టర్ పాల్ హారిస్ అన్నారు.
Details
ఈ సూపర్ కారు 8.3 సెకన్లలో 200kmph వేగాన్ని అందుకోగలదు
ఇది ఎలక్ట్రికల్ హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (eHVAC), కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్లతో ముందుకొచ్చింది.
బానెట్ కింద, ఆర్టురా 3.0L V6 ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో కలిపి 671 bhp పవర్ అవుట్‌పుట్, 720 Nm గరిష్ట టార్క్‌ను ఈ సూపర్ కార్ కలిగి ఉంది. ఇంజిన్ 8-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు.
ఇది కేవలం 8.3 సెకన్లలో 200kmph వేగాన్ని అందుకోగలదు. లిథియం-అయాన్ బ్యాటరీని కేవలం 2.5 గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉంది.