
ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసిన బీఎండబ్య్లూజీ4 రోడ్ స్టర్.. ప్రత్యేకతలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త వెహికల్ వచ్చింది. ప్రీమియం కార్స్ ను ఉత్పత్తి చేసే కంపెనీ బీఎండబ్ల్యూ జీ4 రోడ్ స్టర్ ను భారత్ మార్కెట్లోకి లాంచ్ చేసింది.
ఇండియాలోని బీఎండబ్ల్యూ డీలర్స్ వద్ద ఈ ఓపెన్ టాస్ 2 సీడర్ వెహికల్ ఈ జూన్ నుంచి అందుబాటులోకి రానుంది.
ఈ లగ్జరీ కారు ధర రూ. 89.30 లక్షలు ఉండనుంది. ముఖ్యంగా ఈ కారుకు రెండు సంవత్సరాల అన్ లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీ ఉండడం విశేషం.
ఈ జీ4 రోడ్ స్టర్ లో 3.0 లీటర్, 6 సిలిండర్, ట్విన్ టర్బో చార్జ్ డ్ వీ6 ఇంజన్ ను ప్రత్యేకంగా అమర్చారు. ఇది 8 స్పీడ్ ఆటోమేటిడ్ ట్రాన్స్ మిషన్ తో రానుంది.
Details
4.5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం
ఈ కారు 4.5 సెకన్లలోనే జీరో నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ వెహికల్ కి ఇంటీరియల్స్ కు కాస్ట్‌లీ లుక్ వచ్చేలా బ్లూ కాంట్రాస్ట్ స్టిచింగ్, బ్లూ పైపింగ్ లో లెదర్, అల్కాంటారా ఫినిష్ ఇచ్చారు.
పవర్ ఫుల్ ఇంజన్, గ్రేట్ ఇంటీరియర్స్, అడ్వాన్డ్ ఫీచర్స్ తో బీఎండబ్ల్యూ జీ4 రోడ్ స్టర్ ను రూపొందించామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా హెడ్ విక్రమ్ పావా తెలిపారు.
ఈ బీఎండబ్య్లూ జీ4 రోడ్ స్టర్ కు19 ఇంచ్ అలాయ్ వీల్స్, ఎం స్పోర్ట్స్ బ్రేక్ సిస్టమ్ ను ప్రత్యేకంగా అమర్చారు. అదే విధంగా సీట్స్ కు అదనపు అడ్జస్ట్ మెంట్స్ ఆప్షన్ ఉన్నాయి.