LOADING...
BYD's Yangwang U9: 472 km/h వేగంతో EV టాప్ స్పీడ్ రికార్డ్ బద్దలు కొట్టిన BYD యాంగ్‌వాంగ్ U9
472 km/h వేగంతో EV టాప్ స్పీడ్ రికార్డ్ బద్దలు కొట్టిన BYD యాంగ్‌వాంగ్ U9

BYD's Yangwang U9: 472 km/h వేగంతో EV టాప్ స్పీడ్ రికార్డ్ బద్దలు కొట్టిన BYD యాంగ్‌వాంగ్ U9

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2025
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

BYD కంపెనీకి చెందిన లగ్జరీ పెర్ఫార్మెన్స్ బ్రాండ్ యాంగ్‌వాంగ్ కొత్త మోడల్ U9 Track Edition సరికొత్త ప్రపంచ రికార్డ్ స్థాపించింది. జర్మనీ‌లోని ATP ఆటోమోటివ్ టెస్టింగ్ పాపెన్‌బర్గ్ ట్రాక్‌లో ఆగస్టు 8న ఈ ఎలక్ట్రిక్ వాహనం ఆశ్చర్యకరంగా 472.41 km/h వేగాన్ని దాటింది. 2024లో అదే ట్రాక్‌లో Aspark OWL SP600 హైపర్‌కార్ సాధించిన 438.7 km/h రికార్డును U9 Track Edition అధిగమించి, 472.41 km/hతో కొత్త ప్రపంచ రికార్డ్ స్థాపించింది.

వాహన స్పెసిఫికేషన్స్ 

U9 Track Edition: e4 ప్లాట్ఫారమ్‌తో అధిక శక్తి

U9 Track Edition అనేది సాధారణ రోడ్డు వెర్షన్ U9కి అప్‌గ్రేడ్ చేసిన మోడల్.అత్యధిక వేగం, స్థిరత్వం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. దీని e4 ప్లాట్ఫారమ్ నాలుగు మోటార్లను కలిగి ఉంటుంది. ప్రతి మోటార్ 30,000rpmలో 755hp శక్తిని అందిస్తుంది. ఈ నాలుగు మోటార్ల కలయికతో మొత్తం శక్తి 3,000hpకి పైగా ఉంది. ఇంతే కాకుండా, ఇది 1,217hp/టన్ను శక్తి-తూక నిష్పత్తిని కలిగిన రికార్డ్ స్థాయిలో వాహనం. Legendary Koenigsegg One:1 కంటే కూడా ఇది ఎక్కువ.

సాంకేతిక పురోగతులు 

DiSus-X స్మార్ట్ బాడీ కంట్రోల్ స్థిరత్వాన్ని పెంచుతుంది

U9 Track Edition DiSus-X ఇంటెలిజెంట్ బాడీ కంట్రోల్ సిస్టమ్ తో ఉంటుంది. ప్రతి చక్రాన్ని స్వతంత్రంగా రియల్-టైమ్‌లో సర్దుబాటు చేస్తుంది. ఇది అత్యధిక వేగంతోబాటు , వేగవంతమైన మలుపులలో వాహనాన్ని స్థిరంగా ఉంచుతుంది. రికార్డ్ ప్రయత్నం కోసం Giti టైర్ తో కలిసి ప్రత్యేక సెమీ-స్లిక్ టైర్లను రూపొందించారు, ఇవి భారీ లోడ్స్‌ని తట్టుకోగలవు. కార్బన్ ఫైబర్ స్ప్లిట్టర్,అదనపు థర్మల్ మేనేజ్‌మెంట్ కూడా వాహనం ఈ అసాధారణ వేగాన్ని కొనసాగించడానికి సహాయపడతాయి.

పెర్ఫార్మన్స్ బెంచ్‌మార్క్ 

వేగమే విద్యుత్-వాహనాల భవిష్యత్తు 

U9 Track Edition సాధారణ మోడల్ వంటి ఆకారం కలిగి ఉంటుంది, కానీ టెక్నాలజీ, డిజైన్ మిశ్రమం ఈ ఎలక్ట్రిక్ సూపర్‌కార్లను కొత్త స్థాయికి తీసుకెళ్ళింది. 472.41 km/h రికార్డ్‌ను దాటడం ద్వారా, యాంగ్‌వాంగ్ EV పనితీరు కోసం కొత్త ప్రమాణాలను సృష్టించడమే కాకుండా ట్రేడిషనల్ హైపర్‌కార్ ప్రమాణాలను కూడా సవాల్ చేసింది.