Loading...
BYD Whale MPV: బివైడీ వేల్‌ ఎంపీవీ...ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 900 కిమీ దూసుకుపోతుంది
బివైడీ వేల్‌ ఎంపీవీ...ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 900 కిమీ దూసుకుపోతుంది

BYD Whale MPV: బివైడీ వేల్‌ ఎంపీవీ...ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 900 కిమీ దూసుకుపోతుంది

వ్రాసిన వారు Balachander Sharma
Nov 28, 2026
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్ట్రిక్‌ కార్లలో రేంజ్‌ అంటేనే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ఛార్జింగ్‌ టెన్షన్‌. కానీ ఇప్పుడు ఆటో మొబైల్‌ ఆ ఆలోచనను మార్చేలా బివైడి వేల్‌ ఎంపీవీ వచ్చేసింది. గ్వాంగ్‌జౌ ఆటో షోలో బివైడీ తన తొలి ఫ్లాగ్‌షిప్‌ ఎంపీవీ 'వేల్‌'ను ఆవిష్కరించింది. బివైడీ ఓషన్‌ సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ వాహనం PHEV, EV వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా పూర్తిగా ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 900 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. బివైడీ కొత్త Blade Batteries 2.0 టెక్నాలజీ ఇందులో కీలకంగా పనిచేస్తుంది.

Details

పెద్ద సైజ్‌.. విశాలమైన క్యాబిన్

వేల్‌ ఎంపీవీ పరిమాణం కూడా ఆకట్టుకునేలా ఉంది. దీని పొడవు 5,270 మి.మీ., వెడల్పు 1,996 మి.మీ., ఎత్తు 1,815 మి.మీ. కాగా వీల్‌బేస్‌ 3,130 మి.మీ. గా ఉంది.

అంటే కుటుంబ ప్రయాణాలకు సరిపోయేలా లోపల మంచి స్థలం ఉండే అవకాశం ఉంది.

బివైడీ ఓషన్‌ సిరీస్‌కు అనుగుణంగా స్లీక్‌ లైన్స్‌, డ్యూయల్‌ లేయర్డ్‌ స్టాగర్డ్‌ గ్రిల్‌తో డిజైన్‌ చేశారు.

అంతేకాదు, పైభాగంలో LiDAR సెన్సార్‌ను అమర్చారు. ఇది అధునాతన డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్స్‌ (ADAS) కోసం ఉపయోగపడుతుంది.

Details

5 నిమిషాల్లో 60 శాతం ఛార్జ్

వేల్‌ విషయంలో రేంజ్‌ మాత్రమే కాదు.. ఛార్జింగ్‌ స్పీడ్‌ కూడా హైలైట్‌గా నిలుస్తోంది.

బివైడీ Flash Charging టెక్నాలజీతో 10 శాతం నుంచి 70 శాతం వరకు బ్యాటరీని కేవలం 5 నిమిషాల్లో ఛార్జ్‌ చేయవచ్చని తెలిపింది.

పూర్తి ఛార్జ్‌కు సుమారు 12 నిమిషాలు పడుతుందని పేర్కొంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మైనస్‌ 30 డిగ్రీల సెల్సియస్‌ వరకు తీవ్రమైన చలిలోనూ ఈ ఛార్జింగ్‌ సామర్థ్యం పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.

ప్రయాణంలో ఛార్జింగ్‌ కోసం ఎక్కువ సమయం ఆగాల్సిన అవసరాన్ని తగ్గించడమే దీని ఉద్దేశం.

ADVERTISEMENT

Details

PHEV, EVలో రేంజ్‌ ఇలా ఉంటుంది

వేల్‌ ఎంపీవీని రెండు పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లలో తీసుకురానున్నారు. PHEV వెర్షన్‌ పూర్తిగా ఎలక్ట్రిక్‌ మోడ్‌లో 400 కిలోమీటర్ల CLTC రేంజ్‌ అందిస్తుంది.

ఇక పూర్తిగా ఎలక్ట్రిక్‌ EV వెర్షన్‌ 900 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను అందిస్తుంది.

2027 తొలి త్రైమాసికంలో ఈ వాహనం మార్కెట్లోకి రానుంది. బివైడీ ఇప్పటికే Xia, Linghui M9, Denza D9 వంటి ఎంపీవీలను విక్రయిస్తోంది.

వాటి తర్వాత కంపెనీ లైనప్‌లో చేరనున్న నాలుగో ఎంపీవీగా వేల్‌ నిలవనుంది.

ADVERTISEMENT

Details

ధర కూడా కీలకంగా మారనుంది

వేల్‌ ప్రారంభ ధర సుమారు CNY 3,00,000, అంటే దాదాపు 45,000 డాలర్లు ఉండొచ్చని అంచనా.

బివైడీ Xia ధర CNY 2,49,800 నుంచి, Denza D9 ధర CNY 3,59,800 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. వేల్‌ను ఈ రెండింటి మధ్యలో ఉంచే అవకాశం ఉంది.

భారీ సైజ్‌, 900 కిలోమీటర్లకు పైగా రేంజ్‌, అత్యంత వేగవంతమైన ఛార్జింగ్‌, LiDAR వంటి ఫీచర్లతో బివైడీ వేల్‌ ఎంపీవీ మార్కెట్లోకి వస్తే.. కుటుంబ ప్రయాణాలకు ఎలక్ట్రిక్‌ వాహనాలను ఎంచుకునే వారి దృష్టిని బలంగా ఆకర్షించే అవకాశముంది.

ADVERTISEMENT