LOADING...
Best EV In India: భారతదేశంలో బెస్ట్ ఈవీ.. తక్కువ ధరలో అద్భుత ఫీచర్లతో టాటా టియాగో!
భారతదేశంలో బెస్ట్ ఈవీ.. తక్కువ ధరలో అద్భుత ఫీచర్లతో టాటా టియాగో!

Best EV In India: భారతదేశంలో బెస్ట్ ఈవీ.. తక్కువ ధరలో అద్భుత ఫీచర్లతో టాటా టియాగో!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 31, 2025
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. మెరుగైన ఫీచర్లు, ఎక్కువ కిలోమీటర్ల రేంజ్ అందించే కొత్త మోడల్స్‌ని ఆటో మొబైల్ కంపెనీలు వరుసగా తీసుకువస్తున్నాయి. రోడ్ల వెంట ఛార్జింగ్ స్టేషన్లు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది పెట్రోల్ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకుంటున్నారు. తక్కువ ధరలో మంచి రేంజ్, విశ్వసనీయ పనితీరు కోరుకునే వారికి టాటా టియాగో ఈవీ సరైన ఎంపికగా నిలుస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ కారు సుమారు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇప్పుడు దీని ప్రత్యేకతలను చూద్దాం.

వివరాలు 

రియల్ వరల్డ్ రేంజ్ 

టాటా టియాగో ఈవీ హ్యాచ్‌బ్యాక్ డిజైన్‌లో అందుబాటులో ఉంటుంది. నాలుగు మంది సౌకర్యంగా కూర్చునే విధంగా రూపొందించారు. ఈ కారు మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ మోడల్‌లో 19.2 kWh బ్యాటరీ ఉంటుంది, దీని క్లెయిమ్‌డ్ రేంజ్ 250 కిలోమీటర్లు. మరో వేరియంట్‌లో 24 kWh బ్యాటరీ అందించబడింది, దీని రేంజ్ 315 కిలోమీటర్లు. అయితే వినియోగదారుల అనుభవాలను బట్టి, వాస్తవ పరిస్థితుల్లో 19.2 kWh వేరియంట్ సుమారు 160 కిలోమీటర్లు,24 kWh వేరియంట్ సుమారు 200కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది. రేంజ్ అనేది డ్రైవింగ్ స్పీడ్, రోడ్ కండిషన్‌లపై ఆధారపడి మారవచ్చు. మొత్తానికి, సగటున ఈ కారు ప్రతి కిలోమీటర్ ప్రయాణానికి సుమారు ఒక రూపాయి ఖర్చవుతుందని చెప్పొచ్చు.

వివరాలు 

ఫీచర్లు.. పనితీరు 

టాటా టియాగో ఈవీ ఫీచర్ల పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. కేవలం 10 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగం చేరుతుంది. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో వస్తుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్, రియర్ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు, క్రూజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. 240 లీటర్ల బూట్ స్పేస్తో పాటు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

వివరాలు 

ధర 

ధర పరంగా చూస్తే, టాటా టియాగో ఈవీ బేస్ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం సగటున రెండు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇప్పుడే బుకింగ్ చేస్తే, సుమారు రెండు నెలల తర్వాత డెలివరీ అందించబడుతుంది.