LOADING...
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ప్రారంభం.. బెంగళూరులో ఫ్లయింగ్ ఫ్లీ C6 హవా!
రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ప్రారంభం.. బెంగళూరులో ఫ్లయింగ్ ఫ్లీ C6 హవా!

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ప్రారంభం.. బెంగళూరులో ఫ్లయింగ్ ఫ్లీ C6 హవా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2026
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎప్పటి నుంచో ఆసక్తిని రేకెత్తిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'ఫ్లయింగ్ ఫ్లీ C6' (Flying Flea C6) ఇప్పుడు అధికారికంగా డెలవరీలు ప్రారంభమయ్యాయి. ఈ బైక్‌ను ప్రదర్శించినప్పటి నుంచి "ఇది నిజంగా భారత మార్కెట్లో విక్రయానికి వస్తుందా?" అనే ప్రశ్న వినిపిస్తూనే ఉండేది. అయితే ఇప్పుడు ఆ సందేహాలకు తెరదించుతూ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన తొలి ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలను ప్రారంభించింది. ప్రస్తుతం బెంగళూరులో దశలవారీగా కస్టమర్లకు బైక్‌లను అందజేస్తున్న సంస్థ, భవిష్యత్తులో ఇతర నగరాల్లో కూడా ఈ మోడల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అయితే బెంగళూరు తర్వాత ఏ నగరంలో ఈ బైక్ డెలివరీలు ప్రారంభమవుతాయనే విషయంపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

వివరాలు

ప్రత్యేక ఓనర్‌షిప్ ఎకోసిస్టమ్

ఫ్లయింగ్ ఫ్లీ కేవలం ఒక ఎలక్ట్రిక్ బైక్ మాత్రమే కాదు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రత్యేక ఓనర్‌షిప్ ఎకోసిస్టమ్‌ను కూడా రూపొందించింది. బెంగళూరులో ఇప్పటికే పలు టచ్‌పాయింట్లను ఏర్పాటు చేసిన సంస్థ, హబ్-అండ్-స్పోక్ నెట్‌వర్క్ ద్వారా సమగ్ర సేవలను అందించనుంది. బీటీఎం లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన హబ్ సర్వీస్ సెంటర్ ప్రత్యేక సాంకేతిక సేవలను అందించగా, నగరంలోని ఇతర స్పోక్ సెంటర్లు సాధారణ సర్వీస్, మెయింటెనెన్స్ పనులను నిర్వహిస్తాయి. అలాగే ఇప్పటికే ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలో 'షాప్-ఇన్-షాప్' విధానంలో ఫ్లయింగ్ ఫ్లీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అదనంగా ప్రతి ఫ్లయింగ్ ఫ్లీ C6 బైక్‌తో 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయం కూడా అందించబడుతోంది.

వివరాలు

ధరలు, కలర్ ఆప్షన్లు

ఫ్లయింగ్ ఫ్లీ C6 రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తోంది. వాటిలో 'స్టార్మ్ బ్లాక్' (Storm Black), 'ఫ్లీ గ్రీన్' (Flea Green) ఉన్నాయి. ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.2.79 లక్షలుగా నిర్ణయించారు. అయితే బ్యాటరీ-అజ్-ఎ-సర్వీస్ (BaaS) ప్లాన్‌తో కొనుగోలు చేయాలనుకుంటే రూ.1.99 లక్షల ప్రారంభ ధరతో పాటు బ్యాటరీకి సంబంధించిన నెలవారీ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

వివరాలు

రేంజ్, పనితీరు

ఫ్లయింగ్ ఫ్లీ C6లో 15.4 కిలోవాట్ (20 హెచ్‌పీ) సామర్థ్యమున్న PMSM ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. దీనికి 3.91 kWh బ్యాటరీ ప్యాక్‌ను జత చేశారు. ఈ బైక్ 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.7 సెకన్లలో అందుకోగలదు. గరిష్ఠంగా గంటకు 115 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. ఒకసారి పూర్తి చార్జ్ చేస్తే IDC ప్రమాణాల ప్రకారం 154 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అలాగే ఆన్‌బోర్డ్ ఛార్జర్ సాయంతో బ్యాటరీని 20 శాతం నుంచి 80 శాతం వరకు కేవలం 65 నిమిషాల్లో చార్జ్ చేయవచ్చు.

Advertisement

వివరాలు

డిజైన్ ప్రత్యేకత

డిజైన్ పరంగా ఫ్లయింగ్ ఫ్లీ C6 సంప్రదాయ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ప్రసిద్ధి చెందిన ఒరిజినల్ 'ఫ్లయింగ్ ఫ్లీ' మోటార్‌సైకిల్ నుంచి ప్రేరణ పొందిన ఈ మోడల్‌లో ఎక్స్‌పోజ్డ్ ఫ్రేమ్, గిర్డర్-టైప్ ఫ్రంట్ సస్పెన్షన్, ఫ్లోటింగ్ సీట్, డిటాచబుల్ పిలియన్ సీట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఈ ప్రత్యేక డిజైన్, ఆధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీ కలయికతో ఫ్లయింగ్ ఫ్లీ C6 భారత ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశం కనిపిస్తోంది.

Advertisement