LOADING...
BYD: 1,582 హెచ్‌పీ పవర్‌తో డెంజా Z.. BYD నుంచి సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్!
1,582 హెచ్‌పీ పవర్‌తో డెంజా Z.. BYD నుంచి సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్!

BYD: 1,582 హెచ్‌పీ పవర్‌తో డెంజా Z.. BYD నుంచి సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 12, 2026
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ BYD తన లగ్జరీ బ్రాండ్ డెంజా (Denza) నుంచి అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ సూపర్‌కార్ 'డెంజా Z'ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇటీవల బీజింగ్ మోటార్ షోలో బ్రాండ్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా తొలిసారి ప్రదర్శించిన ఈ కారు వివరాలను తాజాగా చైనా రెగ్యులేటరీ ఫైలింగ్స్ ద్వారా కంపెనీ వెల్లడించింది. నాలుగు సీట్లతో రూపొందిన ఈ ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ 1,582 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగల సామర్థ్యం దీనికి ఉంది. డెంజా Zను ముందుగా యూరప్ మార్కెట్లో విడుదల చేసి, అనంతరం జూలైలో చైనా మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు BYD ప్రకటించింది.

వివరాలు

రెండు వేరియంట్లలో అందుబాటులోకి

డెంజా Zను రెండు ప్రధాన వేరియంట్లలో తీసుకురానున్నారు. సాఫ్ట్-టాప్ కన్వర్టిబుల్ వేరియంట్ ఈ మోడల్‌లో సెమీ-హిడెన్ డోర్ హ్యాండిల్స్, 20 అంగుళాల అలాయ్ వీల్స్, వెడల్పు భిన్నంగా ఉండే టైర్లు ఉన్నాయి. కారు పొడవు 4,780 మిల్లీమీటర్లు. ఖాళీ బరువు 2,290 కిలోలు కాగా, గరిష్ట స్థూల బరువు 2,650 కిలోల వరకు ఉంటుంది. హార్డ్-టాప్ రోడ్‌స్టర్ వేరియంట్ ఈ వెర్షన్‌లో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్-అవుట్ పిలర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఖాళీ బరువు 2,220 కిలోలు కాగా, గరిష్ట స్థూల బరువు 2,580 కిలోల వరకు ఉంటుంది. ఇది సాఫ్ట్-టాప్ వెర్షన్ కంటే కొద్దిగా తక్కువ బరువుతో వస్తుంది.

వివరాలు

0 నుంచి 100 కిమీ వేగం.. రెండు సెకన్లలోపే

డెంజా Zలో అత్యంత శక్తివంతమైన మూడు ఎలక్ట్రిక్ మోటార్ల సెటప్‌ను అమర్చారు. ఇందులో ఒక మోటార్ ముందు భాగంలో, రెండు మోటార్లు వెనుక భాగంలో ఉంటాయి. ముందు మోటార్ పవర్: 670 హెచ్‌పీ వెనుక రెండు మోటార్ల కలిపిన పవర్: 912 హెచ్‌పీ మొత్తం పవర్ అవుట్‌పుట్: 1,582 హెచ్‌పీ ఈ శక్తివంతమైన వ్యవస్థతో కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని రెండు సెకన్లలోపే అందుకోగలదని డెంజా పేర్కొంది. సాధారణ వెర్షన్ గరిష్ట వేగం గంటకు 300 కిలోమీటర్లు.

Advertisement

వివరాలు

స్పోర్ట్స్ ప్యాకేజీతో 350 కిమీ వేగం

డెంజా Zకు ప్రత్యేక స్పోర్ట్స్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో పెద్ద రియర్ వింగ్, మరింత అగ్రెసివ్ బంపర్లు, 21 అంగుళాల వెడల్పైన వీల్స్‌ను అందిస్తారు. ఈ అప్‌గ్రేడ్స్‌తో కారు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లకు చేరుకుంటుంది. అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు డెంజా Zలో పలు ఆధునిక సాంకేతికతలను అందించారు. స్టీర్-బై-వైర్ టెక్నాలజీ DiSus-M మాగ్నెటోరియోలాజికల్ సస్పెన్షన్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ DiPilot 5.0 డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అలాగే ఈ సూపర్‌కార్‌లో LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. అయితే బ్యాటరీ సామర్థ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Advertisement