Page Loader
Vida V2: వీడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.40వేల వరకు డిస్కౌంట్.. ఈ అవకాశాన్ని మిస్ కావొద్దు!
వీడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.40వేల వరకు డిస్కౌంట్.. ఈ అవకాశాన్ని మిస్ కావొద్దు!

Vida V2: వీడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.40వేల వరకు డిస్కౌంట్.. ఈ అవకాశాన్ని మిస్ కావొద్దు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 02, 2025
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ ద్వారా V2 ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.40వేల వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్లు వీడా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఈ షాపింగ్ వెబ్‌సైట్లు బ్యాంక్ డిస్కౌంట్లు, EMIలు, క్యాష్‌బ్యాక్, GST ప్రయోజనాలను అందిస్తున్నాయి. వీడా V2 లైట్ వీడా V2 లైట్ ఈ సిరీస్‌లో అత్యంత తక్కువ ధరలో లభించే మోడల్. ఇది 2.2 kWh బ్యాటరీతో వస్తుంది. పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు 94 కి.మీ (IDC) రేంజ్‌ను అందిస్తుంది. ఈ మోడల్ వీడా లైన్‌అప్‌లో కొత్తగా చేరింది.

Details

వీడా V2 వేరియంట్లు 

వీడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లస్, ప్రో వెర్షన్లలో కూడా లభిస్తుంది. V2 లైట్ గరిష్ట వేగం గంటకు 69 కి.మీ. - రైడ్, ఈకో అనే రెండు రైడింగ్ మోడెల్ వలె ఉంటుంది. ఇందులో స్పెసిఫికేషన్లు 7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో ఖరీదైన మోడళ్లతో సమానంగా ఉండనున్నాయి. V2 ప్లస్ 3.44 kWh బ్యాటరీతో 143 కి.మీ రేంజ్‌, V2 ప్రో 3.94 kWh బ్యాటరీతో 165 కి.మీ గరిష్ట రేంజ్‌ను అందిస్తుంది. V2 సిరీస్ డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటుంది. వీటిని సుమారు ఆరు గంటల్లో 80% వరకు ఛార్జ్ చేయవచ్చు.

Details

 వీడా V2 స్పెసిఫికేషన్లు 

వీడా V2 స్వింగ్‌ఆర్మ్‌పై అమర్చిన PMS మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 6 kW (8 bhp) శక్తిని ఉత్పత్తి చేయనుంది. - 26 Nm గరిష్ట టార్క్ అందిస్తుంది. V2 ప్లస్, ప్రో మోడళ్లు ఈకో, రైడ్, స్పోర్ట్, కస్టమ్ అనే నాలుగు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటాయి. V2 ప్లస్ గరిష్ట వేగం గంటకు 85 కి.మీ కాగా, V2 ప్రో గరిష్ట వేగం గంటకు 90 కి.మీ డిజైన్, కలర్ ఆప్షన్లు వీడా V2 ఇప్పుడు ఉన్న V1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పోలి ఉంటుంది. మ్యాట్ నెక్సస్ బ్లూ-గ్రే, గ్లాసీ స్పోర్ట్స్ రెడ్ అనే రెండు కొత్త రంగులలో లభిస్తుంది. బ్యాటరీ ప్యాక్‌లు 3 సంవత్సరాలు వారంటీ

Details

అదనపు ఫీచర్లు

క్రూజ్ కంట్రోల్ కీలెస్ ఎంట్రీ రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి ప్రత్యేక ఫంక్షన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 250+ నగరాల్లో 3,100 ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను V2 వినియోగదారులు యాక్సెస్ చేయవచ్చు. వీడా V2 ప్రత్యర్థులు రిజ్టా, ఐక్యూబ్, చేతక్, అంపేర్ నెక్సస్, హోండా యాక్టివా ఇ (స్వాపబుల్ బ్యాటరీలతో) వంటి మోడళ్లతో కొత్త వీడా V2 పోటీ పడుతుంది.