Loading...
BMW M 1000 RR: పోలీస్ పెట్రోలింగ్‌లోకి బిఎండబ్ల్యూ M 1000 RR.. స్పీడ్ చూస్తే షాకే
పోలీస్ పెట్రోలింగ్‌లోకి బిఎండబ్ల్యూ M 1000 RR.. స్పీడ్ చూస్తే షాకే

BMW M 1000 RR: పోలీస్ పెట్రోలింగ్‌లోకి బిఎండబ్ల్యూ M 1000 RR.. స్పీడ్ చూస్తే షాకే

వ్రాసిన వారు Balachander Sharma
Nov 20, 2026
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

లగ్జరీ కార్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుబాయ్ పోలీసులు ఇప్పుడు తమ పెట్రోలింగ్ ఫ్లీట్‌లోకి అత్యంత శక్తివంతమైన బిఎండబ్ల్యూ M 1000 RR సూపర్‌బైక్‌ను చేర్చారు. 218 హెచ్‌పీ పవర్‌తో దూసుకెళ్లే ఈ బైక్‌ను దుబాయ్‌లో జరిగిన వరల్డ్ పోలీస్ సమ్మిట్‌లో ఆవిష్కరించారు. పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ ల్యాండ్‌మార్క్‌ల వద్ద పోలీసుల ఉనికిని మరింత పెంచడంతో పాటు, సందర్శకులతో పోలీసులు నేరుగా మాట్లాడేందుకు కూడా దీన్ని ఉపయోగించనున్నారు. బిఎండబ్ల్యూ అధికారిక దిగుమతిదారు AGMC భాగస్వామ్యంతో ఈ బైక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Details

రోల్స్ రాయిస్, ఫెరారీ సరసన బిఎండబ్ల్యూ సూపర్‌బైక్

దుబాయ్ పోలీసుల లగ్జరీ వాహనాల జాబితాలో ఇప్పటివరకు రోల్స్ రాయిస్ కల్లినన్, పోర్షే 918 స్పైడర్, ఫెరారీ FF వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.

ఇప్పుడు ఆ జాబితాలో చేరిన తొలి లగ్జరీ మోటార్‌సైకిల్ M 1000 RR కావడం విశేషం.

పోలీస్ పెట్రోలింగ్‌తో పాటు ప్రజలకు పోలీసు సేవలపై అవగాహన కల్పించేందుకు కూడా అధికారులు ఈ బైక్‌ను వినియోగించనున్నారు.

Details

999 సీసీ ఇంజిన్.. గంటకు 314 కిలోమీటర్ల వేగం

ఈ బిఎండబ్ల్యూ సూపర్‌బైక్‌లో 999 సీసీ, ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఉంది.

ఇది 14,500 RPM వద్ద 218 హెచ్‌పీ పవర్, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

గరిష్ఠంగా గంటకు 314 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. బైక్ బరువు 194 కిలోలు కాగా, 16.5 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది.

ADVERTISEMENT

Details

పోలీసుల కోసం ప్రత్యేక మార్పులు

ఇంజిన్, పనితీరులో ఎలాంటి మార్పులు చేయకుండా బైక్‌కు పోలీస్ అవసరాలకు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు.

తెలుపు, ఆకుపచ్చ రంగుల పెయింటింగ్‌తో పాటు ఎడమవైపు సైరన్ ఏర్పాటు చేశారు. ఏరోడైనమిక్ వింగ్‌లెట్స్‌పై ఎమర్జెన్సీ లైట్లు అమర్చారు.

వరల్డ్ సూపర్‌బైక్ ఛాంపియన్‌షిప్‌లో 2024, 2025 సీజన్లలో టోప్రాక్ రజ్గట్లియోగ్లు టైటిళ్లు సాధించిన రేసింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే.

అయితే ఈ పోలీస్ బైక్ రేస్ ట్రాక్‌పై కాకుండా దుబాయ్ వీధుల్లో, పర్యాటక ప్రాంతాల్లో కనిపించనుంది.

ADVERTISEMENT