LOADING...
Magnus Electric Scooter : దసరా స్పెషల్ ఆఫర్.. ఆంపియర్ మాగ్నస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్!
దసరా స్పెషల్ ఆఫర్.. ఆంపియర్ మాగ్నస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్!

Magnus Electric Scooter : దసరా స్పెషల్ ఆఫర్.. ఆంపియర్ మాగ్నస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2025
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

దసరా పండగ కోసం ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొనాలనుకునేవాళ్లు శుభవార్త అందింది. ఈవీ కంపెనీ ఆంపియర్ తాజాగా లాంఛ్ చేసిన 'మాగ్నస్' స్కూటర్ ఇప్పుడు ప్రత్యేక ఆఫర్‌లో అందుబాటులో ఉంది. స్కూటర్‌పై రూ. 20,000 డిస్కౌంట్ లభిస్తోంది.

Details

ఆఫర్ వివరాలివే

ఆంపియర్ మాగ్నస్ నియో స్కూటర్ షోరూమ్ ధర సుమారు రూ. 90,000 ఉండగా, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇది రూ. 81,999కే లభిస్తుంది. ICICI లేదా Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ. 11,000 వరకు తగ్గింపు పొందవచ్చు. మొత్తం తీసుకుంటే స్కూటర్‌ను రూ. 70,000లో సొంతం చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు లేకపోతే UPI పేమెంట్ ద్వారా కూడా కనీసం రూ. 7,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ ప్రీమియం ఫోన్స్ (ఐఫోన్, శాంసంగ్, వివో) ధరలకంటే తక్కువ ధరలో ఈవీ స్కూటర్‌ను అందిస్తోంది.

Details

 ఫీచర్స్ 

2.5 kW బ్యాటరీ సామర్థ్యం ఫుల్ ఛార్జ్‌కి సుమారు 5 గంటల సమయం ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 90 కిలోమీటర్ల రేంజ్ గరిష్ట వేగం 65 km/h 3.5 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ IP67 వాటర్‌ప్రూఫ్ రేటింగ్ USB ఛార్జింగ్ పోర్ట్, LED హెడ్‌లైట్స్ 22 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ 5 సంవత్సరాలు లేదా 75,000 km వారంటీ బ్యాటరీకి 3 సంవత్సరాలు లేదా 30,000 km వారంటీ