Honda electric SUV:హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. ఈ మోడల్ ప్రత్యేకతలు ఇవే!
హోండా సంస్థ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించిన కాన్సెప్ట్‌ను డిస్ప్లే చేసింది. ఇది ఎంతో స్టైలిష్‌గా, ఫ్యూచరిస్టిక్ డిజైన్ ను కలిగి ఉంది. జపాన్‌కు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా తన సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పరిచయం చేసింది. ఇండోనేషియాలో జరిగిన గోయికిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షోలో.. ఈ- ఎస్యూవీ ప్రొటోటైప్ మోడల్‌ను ప్రదర్శించింది. ఇది చూడడానికి చాలా స్టైలిష్‌గా ఉంది. ఈ మోడల్ విశేషాలను ఒక్కసారి చూస్తే ఔరా అనాల్సిందే. కొన్ని సంవత్సరాలుగా.. ఈవీ సెగ్మెంట్‌పై ఫోకస్ చేసిన హోండా సంస్థ, ఇందులో భాగంగానే.. 2ఏళ్ల క్రితం షాంఘై ఆటో షోలో ఓ ఈ-ఎస్యూవీ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. తాజాగా ఇండోనేషియాలో ఆవిష్కరించిన ప్రోటోటైప్ మోడల్.. ఇదేనని తెలుస్తోంది.
అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్పీరియెన్స్
హోండా సంస్థ చెప్పిన ప్రకారం దీనిని"హోండా ఎస్యూవీ ఈ: ప్రోటోటైప్ కాన్సెప్ట్" అని పిలుస్తున్నారు. గ్లోబల్ ట్రెండ్స్, కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు, ఈకో ఫ్రెండ్లీ వాహనాలను తయారీకి హోండా కట్టుబడి ఉందని ఆ సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ యుసక్ బిల్లి తెలిపారు. ప్రోటోటైప్‌లో ఫ్యూచరిస్టిక్ డిజైనే కాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా ఉపయోగించినట్టు తెలుస్తోంది. డైనమిక్ డిజైన్ స్టైల్‌తో కూడిన ఈ కారులో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుందని సంస్థ చెప్పింది. ఎఫీషియెంట్ అడ్వాన్స్డ్ బ్యాటరీ టెక్నాలజీతో ఈ ఎస్యూవీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండనుంది. ఈ ఈవిలో అడ్వాన్స్డ్ టచ్ స్క్రీన్, టీఎఫ్టీ మల్టీ- ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, ఓటీఏ3 ఆధారిత వాయిస్ రికగ్నీషన్, హోండా సెన్సింగ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
భారతదేశంలో ఈవీలను లాంచ్ చేయాలని ప్లాన్
భారతదేశంలో ఆటోమొబైల్ మార్కెట్‌కు ఉన్న డిమాండ్‌ను తెలిసిన హోండా సంస్థ 2030 నాటికి కనీసం 5 ఈవీలను ఇక్కడ లాంచ్ చేయాలని ప్లాన్ చేసింది. తాజాగా ప్రదర్శించిన ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూడా త్వరలోనే ఇండియాలో అడుగుపెట్టనుంది. అంతేకాకుండా , కొత్తగా ఇండియాలో లాంచ్ అయిన ఎలివేట్ ఎస్‌యూవీకి కూడా ఈవీ టచ్ ఇవ్వనుంది. మరి ఇవి ఎప్పుడు లాంచ్ అవుతాయో వేచి చూడాలి. ఇండోనేషియా ఆటో షోలో ఈ-ఎస్యూవీ ప్రోటోటైప్‌తో పాటు Honda N- Van ఈవీ ప్రోటోటైప్, All New HondaCR-V RE E:HEV, Honda ACCORD E:HEV, HONDA CR-Z వంటి మోడల్స్‌ను కూడా ప్రదర్శనకు ఉంచింది.