క్యాబిన్ ప్రెజర్ తగ్గడంతో బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైన ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం
200 మందికి పైగా ప్రయాణికులతో ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. విమానం క్యాబిన్‌లో ఒత్తిడి తగ్గడంతో పైలట్‌లు తిరిగి వెనక్కి తిప్పాల్సి వచ్చింది. బెంగుళూరు నుండి అబుదాబికి బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించాక నాలుగు గంటల ఆలస్యం తర్వాత విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది, ఆదివారం రాత్రి 9.07 గంటలకు బెంగళూరు నుంచి అబుదాబికి ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం EY 237 బయలుదేరినట్లు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) వర్గాలు ధృవీకరించాయి.
ఫ్లయిట్ లో డజను మంది సిబ్బంది కంటే కొంచెం తక్కువ ఉన్నారు
టేకాఫ్ అయిన నిమిషాల తర్వాత, ప్రయాణికులతో నిండిన విమానం లోపల క్యాబిన్ ప్రెజర్ తగ్గినట్లు కెప్టెన్ గుర్తించారు. ఆ సమయంలో ఫ్లయిట్ లో డజను మంది సిబ్బంది కంటే కొంచెం తక్కువ ఉన్నారు. పైలట్లు KIAలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) టవర్‌ను అప్రమత్తం చేశారు విమానాన్ని తిప్పారు. ఎతిహాద్ విమానం నంది హిల్స్ ప్రాంతంలో చక్కర్లు కొట్టింది, విమానం ప్రయాణికులు, సిబ్బందితో సురక్షితంగా రాత్రి 10 గంటల ముందు అత్యవసర ల్యాండింగ్ చేసింది.