Fastag price: వాహనదారులకు షాక్.. ఏప్రిల్ నుంచి ధరలు పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా వాహనదారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) కీలక ప్రకటన చేసింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను పెంచుతున్నట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం రూ.3,000గా ఉన్న వార్షిక పాస్ ధరపై 2.5 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ పెంపుతో కొత్త ధర రూ.3,075కు చేరనుంది. ఈ సవరించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది.
వివరాలు
వారికి మరో అవకాశం
అయితే ఫాస్టాగ్ వినియోగదారులకు ఒక అవకాశం కూడా ఉంది. మార్చి 31లోపు వార్షిక పాస్‌ను రీఛార్జ్ చేసుకుంటే ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలకే పాస్ పొందవచ్చు. అంటే రూ.3,000కే ఇయర్ పాస్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఫాస్టాగ్ వార్షిక పాస్ ఒకసారి తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఒక సంవత్సరం పాటు లేదా 200 టోల్ ప్లాజాల వరకు ఆగకుండా ప్రయాణించవచ్చు. ఇందులో ఏది ముందుగా పూర్తవుతుందో ఆ వరకే ఈ సౌకర్యం వర్తిస్తుంది. అవసరమైతే ఏడాది కాలంలో ఎన్నిసార్లైనా రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 2025 ఆగస్టు 15న ప్రారంభించిన ఈ విధానానికి వాహనదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు 52 లక్షలకుపైగా వాహనదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.