Loading...
Ferrari 296 Challenge: హైబ్రిడ్‌ టెక్నాలజీకి గుడ్‌బై.. ఫెరారీ కొత్త స్పోర్ట్స్‌ కారులో కీలక మార్పులు
హైబ్రిడ్‌ టెక్నాలజీకి గుడ్‌బై.. ఫెరారీ కొత్త స్పోర్ట్స్‌ కారులో కీలక మార్పులు

Ferrari 296 Challenge: హైబ్రిడ్‌ టెక్నాలజీకి గుడ్‌బై.. ఫెరారీ కొత్త స్పోర్ట్స్‌ కారులో కీలక మార్పులు

వ్రాసిన వారు Balachander Sharma
Nov 22, 2026
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్పోర్ట్స్‌ కార్లంటే వేగం, ఇంజిన్‌ శబ్దం, డ్రైవింగ్‌లో థ్రిల్‌.. ఇవే గుర్తొస్తాయి. ఇప్పుడు ఆటో మొబైల్‌ రంగంలో ఫెరారీ కూడా అదే అనుభూతికి ప్రాధాన్యతనిస్తూ 296 Challenge Stradaleను ఆవిష్కరించింది. సాధారణ 296 GTBలో ఉన్న హైబ్రిడ్‌ వ్యవస్థను ఇందులో తొలగించారు. దాని స్థానంలో 670hp శక్తిని అందించే ట్విన్‌ టర్బో V6 పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. పవర్‌ పరంగా ఇది 296 GTB కంటే తక్కువే అయినప్పటికీ, హైబ్రిడ్‌ వ్యవస్థను తొలగించడం వల్ల కారు బరువు సుమారు 149 కిలోలు తగ్గింది. డ్రైవింగ్‌లో మరింత ప్రత్యక్షమైన అనుభూతి అందించడమే ఈ మార్పు వెనుక ఉద్దేశం.

Details

వేగంలోనూ కారు అదుపు తప్పకుండా..

ఈ ఫెరారీ ప్రత్యేకత ఇంజిన్‌తోనే ఆగిపోలేదు. అధిక వేగంలో కారు రోడ్డుపై మరింత స్థిరంగా ఉండేందుకు ఏరోడైనమిక్‌ డిజైన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

కార్బన్‌ ఫైబర్‌ వెనుక వింగ్‌, సర్దుబాటు చేసుకునే ఫ్రంట్‌ స్ప్లిటర్‌, గాలి వెళ్లేందుకు వీలుగా రూపొందించిన బానెట్‌ ఇందులో ఉన్నాయి. కారు అడుగు భాగాన్ని కూడా గాలి ప్రవాహానికి అనుకూలంగా తీర్చిదిద్దారు.

ఫలితంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు 617 కిలోల డౌన్‌ఫోర్స్‌ ఉత్పత్తి అవుతుంది.

అంటే వేగంగా వెళ్తున్నప్పుడు కారు రోడ్డుపై గట్టిగా నిలబడేందుకు ఈ వ్యవస్థ సహాయపడుతుంది.

Details

రేసింగ్‌ టెక్నాలజీతో సస్పెన్షన్

త్వరలో రానున్న 296 Challenge Evo రేసింగ్‌ కారు నుంచి కొన్ని సాంకేతిక అంశాలను ఈ మోడల్‌కు తీసుకొచ్చారు.

ముఖ్యంగా కొత్త సస్పెన్షన్‌ వ్యవస్థతో రోడ్డు గుంతలు, మలుపుల వద్ద కారు కదలికలను మెరుగ్గా నియంత్రించవచ్చు. బాడీ ఎక్కువగా ఒరిగిపోకుండా ఉండటంతో పాటు సస్పెన్షన్‌ తిరిగి సాధారణ స్థితికి చేరుకునే వేగాన్ని మెరుగుపరిచారు.

లోపల కార్బన్‌ ఫైబర్‌ డోర్‌ ప్యానెల్స్‌ అమర్చారు. బరువు తగ్గించేందుకు ఆర్మ్‌రెస్టులు, స్టోరేజ్‌ పాకెట్లను తొలగించారు.

అయినప్పటికీ క్లైమేట్‌ కంట్రోల్‌, స్టీరియో వంటి సౌకర్యాలు అందించారు.

ADVERTISEMENT

Details

2027లో అమ్మకాలు.. ధర రూ.2.7 కోట్లకు పైనే

ఫెరారీ 296 Challenge Stradale అమెరికా మార్కెట్లో 2027 మూడో త్రైమాసికంలో అమ్మకాలకు రానుంది.

దీని అంచనా ధర 3,07,000 డాలర్లు. భారత కరెన్సీలో సుమారు రూ.2.7 కోట్లకు పైగా ఉంటుంది.

అయితే దిగుమతి పన్నులు, ఇతర ఖర్చులతో భారత్‌లో ధర మరింత పెరగవచ్చు. ఈ మోడల్‌ పరిమిత సంఖ్యలో మాత్రమే తయారు చేయడం లేదని ఫెరారీ తెలిపింది.

296 Specialeకు ఇది ప్రత్యామ్నాయం కాదని, భిన్నమైన కస్టమర్లను లక్ష్యంగా చేసుకున్న ప్రత్యేక కారు అని స్పష్టం చేసింది.

ADVERTISEMENT