Maruti Dzire: పండుగ సీజన్ ఆఫర్లు.. అదనపు డిస్కౌంట్లతో భారీగా పెరిగిన అమ్మకాలు!
ఈ వార్తాకథనం ఏంటి
అక్టోబర్ 2025లో మారుతీ సుజుకీ డిజైర్ అద్భుత ప్రదర్శనతో దేశంలోని ఎస్‌యూవీల ఆధిపత్యాన్ని తిప్పికొడుతూ అమ్మకాల చార్ట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. సబ్-కాంపాక్ట్ సెడాన్ 20,791 యూనిట్లతో అత్యధికంగా అమ్ముడయింది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే 64% వృద్ధి సాధించింది. సాధారణంగా భారతీయ వాహన మార్కెట్లో వినియోగదారులు ఎస్‌యూవీలు, ఎంపీవీల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ వస్తే, డిజైర్ ఈ ట్రెండ్‌ను విరుద్ధంగా కొనసాగిస్తూ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టాటా నెక్సాన్ తర్వాత దేశంలో రెండవ అత్యధికంగా అమ్ముడయిన వాహనంగా కూడా నిలిచింది.
Details
డిజైర్ అమ్మకాలకు మూడు ప్రధాన కారణాలివే
మొదట, జీఎస్‌టీ (GST) రేట్ల తగ్గింపు. సెప్టెంబర్ 2025లో అమలైన కొత్త పన్ను విధానం (GST 2.0) కింద ప్యాసింజర్ వాహనాలపై జీఎస్‌టీ 28% నుంచి 18%కి తగ్గించబడింది. అలాగే, సెస్ తొలగింపుతో మొత్తం పన్ను భారం గణనీయంగా తగ్గింది. 4 మీటర్ల లోపు పొడవు, 1200సీసీ లోపు పెట్రోల్ ఇంజిన్ కలిగిన డిజైర్‌పై ఈ తగ్గింపు మరింత ప్రభావం చూపింది. ఫలితంగా వేరియంట్ ఆధారంగా డిజైర్ ధర రూ.58,000 నుంచి రూ.88,000 వరకు తగ్గించబడింది, ఇది వినియోగదారులను మరింత ఆకర్షించింది. రెండవ కారణం పండుగ డిస్కౌంట్లు అక్టోబర్ 2025లో దేశంలో పండుగ సీజన్ ఉండటంతో, మారుతి సుజుకి సహా అన్ని కంపెనీలు ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించాయి.
Details
భద్రతా ప్రమాణాలతో కూడిన కొత్త మోడల్
జీఎస్‌టీ తగ్గింపు తరువాత అదనపు పండుగ ఆఫర్లు వినియోగదారులకు ఆర్థికప్రయోజనాలను అందించాయి, ఇది డిజైర్ అమ్మకాలను పెంచడంలో ముఖ్య కారణమైంది. మూడవ కారణం కొత్త తరం మోడల్ ఆకర్షణ. డిజైర్ కొత్త మోడల్ పాత మోడల్ కంటే సమకాలీన, స్టైలిష్ డిజైన్ అప్‌డేట్‌లు పొందింది. అంతర్గత భాగాల్లో(Interior)ఆధునిక ఫీచర్లు, మెరుగైన ఇంఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, Bharat NCAP క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించాయి. అప్‌గ్రేడ్ పవర్‌ట్రైన్, అద్భుతమైన మైలేజీ(CNG వేరియంట్‌లో 33.73 కిమీ/కిలోమీటర్)డిజైర్ ఆకర్షణను ప్రైవేట్ మరియు ఫ్లీట్ విభాగాల్లో మరింత పెంచింది. ధర తగ్గింపు, పండుగ డిమాండ్, మెరుగైన ఫీచర్లు, భద్రతా ప్రమాణాలతో కూడిన కొత్త మోడల్ కలయికతో, డిజైర్ అక్టోబర్2025లో మార్కెట్‌లో శక్తివంతమైన రికార్డు నెలకొల్పింది.