Loading...
TVS Ronin: టీవీఎస్ బైక్స్‌కు ఫెస్టివ్ అప్‌డేట్స్.. రూ.1.27 లక్షల నుంచే కొత్త వేరియంట్లు
టీవీఎస్ బైక్స్‌కు ఫెస్టివ్ అప్‌డేట్స్.. రూ.1.27 లక్షల నుంచే కొత్త వేరియంట్లు

TVS Ronin: టీవీఎస్ బైక్స్‌కు ఫెస్టివ్ అప్‌డేట్స్.. రూ.1.27 లక్షల నుంచే కొత్త వేరియంట్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2026
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

పండుగ సీజన్‌ నేపథ్యంలో టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ (TVS Motor Company) తన మోటార్‌సైకిల్‌ పోర్ట్‌ఫోలియోలో పలు అప్‌డేట్స్‌ చేసింది. అపాచీ (Apache), రోనిన్‌ (Ronin) సిరీస్‌లలో కొత్త వేరియంట్లు, అదనపు ఫీచర్లు, కొత్త కలర్‌ ఆప్షన్లను తీసుకొచ్చింది. ముఖ్యంగా అపాచీ RTR సిరీస్‌లో సేఫ్టీ, కనెక్టివిటీ ఫీచర్లను మెరుగుపరిచింది. అలాగే అపాచీ RR 310, RTR 310 మోడళ్లలో బ్లాక్‌ డైమండ్‌ ఎడిషన్లను పరిచయం చేసింది. రోనిన్‌ శ్రేణిలో కొత్త Base+ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వివరాలు

TVS Apache RTR 160, RTR 160 4V, RTR 200 4Vలో అప్‌డేట్స్

ప్రపంచవ్యాప్తంగా అపాచీ బైక్‌లను వినియోగిస్తున్న రైడర్ల సంఖ్య 70 లక్షలకు చేరిన సందర్భంగా టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ Apache RTR 160, Apache RTR 160 4V, Apache RTR 200 4V మోడళ్లను అప్‌డేట్‌ చేసింది.

ఈ బైక్స్‌లో కొత్త సేఫ్టీ, కనెక్టివిటీ, సౌకర్యవంతమైన ఫీచర్లను జోడించింది. Apache RTR 160లో ఇప్పుడు ట్రాక్షన్‌ కంట్రోల్‌, హజార్డ్‌ ల్యాంప్స్‌, LED టర్న్‌ సిగ్నల్‌ ల్యాంప్స్‌ను అందిస్తోంది.

ఇక Apache RTR 160 4Vలో TFT డిస్‌ప్లేతో పాటు Google Maps మిర్రరింగ్‌, Panic Brake Alert, USB Type-C ఛార్జర్‌ వంటి ఫీచర్లు వచ్చాయి.

Apache RTR 200 4Vలో అడ్జస్టబుల్‌ USD ఫ్రంట్‌ సస్పెన్షన్‌ను జోడించారు.

వివరాలు

ఛార్జింగ్ సదుపాయం

దీనితో పాటు TFT డిస్‌ప్లే, నావిగేషన్‌ సపోర్ట్‌, Panic Brake Alert, USB Type-C ఛార్జింగ్‌ సదుపాయాలను అందిస్తున్నారు.

అప్‌డేట్‌ చేసిన ఈ మోటార్‌సైకిళ్లు అపాచీ RTR లైనప్‌లో ప్రస్తుతం ఉన్న టాప్‌-స్పెక్‌ వేరియంట్ల స్థానాన్ని భర్తీ చేయనున్నాయని టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ తెలిపింది.

డ్యూయల్‌ ఛానల్‌ ABS, TCSతో వచ్చిన అప్‌డేటెడ్‌ TVS Apache RTR 160 ధర ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌ ప్రకారం రూ.1.28 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

ఇది ఎరుపు రంగు అల్లాయ్ వీల్స్‌తో మ్యాట్ బ్లాక్, ఎరుపు రంగు అల్లాయ్ వీల్స్‌తో పెర్ల్ వైట్, ఆర్కిటిక్ టీల్, గ్రానైట్ గ్రే రంగుల్లో లభిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు

రూ.1.41 లక్షల నుంచి మొదలు

TFT డిస్‌ప్లే, మ్యాప్‌ మిర్రరింగ్‌తో కూడిన Apache RTR 160 4V ధర రూ.1.41 లక్షల నుంచి మొదలవుతుంది.

ఈ బైక్‌ Arctic Teal with Champagne Gold Alloy Wheels, Matte Black, Racing Red, Marine Blue రంగుల్లో అందుబాటులో ఉంటుంది. TFT డిస్‌ప్లే, మ్యాప్‌ మిర్రరింగ్‌తో కూడిన Apache RTR 200 4V ధర రూ.1.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

ఈ మోడల్‌ Sepang Blue with Red Alloy Wheels, Armoury Green, Racing Red, Matte Black రంగుల్లో లభిస్తుంది. ఈ ధరలు అన్నీ ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌ ధరలు.

ADVERTISEMENT

వివరాలు

అపాచీ RR 310, RTR 310లో బ్లాక్ డైమండ్ ఎడిషన్

TVS Motor Company Apache RR 310, Apache RTR 310 మోడళ్లలో Black Diamond Editionsను కూడా పరిచయం చేసింది.

ఈ కొత్త ఎడిషన్లలో పూర్తిగా బ్లాక్‌ లివరీతో పాటు అప్‌డేటెడ్‌ ఎక్విప్‌మెంట్‌ను అందించారు. Apache RR 310లో Keyless Ride టెక్నాలజీని కొత్తగా జోడించారు.

ఇక Apache RR 310, Apache RTR 310 రెండింటిలోనూ RT-DSC, Cruise Control, Cornering ABS, Cornering Traction Control, Launch Control, Drag Torque Control వంటి ఫీచర్లు కొనసాగుతున్నాయి.

వివరాలు

TVS Roninలో కొత్త Base+ వేరియంట్

టీవీఎస్‌ రోనిన్‌ లైనప్‌లో కూడా కంపెనీ పలు మార్పులు చేసింది. ఇందులో కొత్త Base+ వేరియంట్‌ను పరిచయం చేయడంతో పాటు Mid, Top వేరియంట్లలో అదనపు ఫీచర్లను జోడించింది.

కొత్త Ronin Base+వేరియంట్‌లో డ్యూయల్‌ ఛానల్‌ ABSను అందిస్తున్నారు.

ఇది Sunlit Yellow, Desert Mirage రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ.1.42 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). Ronin Mid వేరియంట్‌లో Connected Instrument Cluster, USB Type-Cఛార్జర్‌ను కొత్తగా అందించారు. ఇక Top వేరియంట్‌లో ట్రాక్షన్‌ కంట్రోల్‌, USB Type-C ఛార్జర్‌, ప్రీమియం సీట్‌ వంటి ఫీచర్లు వచ్చాయి.

TVS Ronin Mid వేరియంట్‌ ధర రూ.1.52 లక్షల నుంచి, Topవేరియంట్‌ ధర రూ.1.64 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇవి ఎక్స్‌షోరూమ్‌ ధరలు.

ADVERTISEMENT