2022లో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ ను వీడిన టాప్ 5 మోడల్స్
2022 సంవత్సరం భారతీయ ఆటోమోటివ్ మార్కెట్‌లో చాలా కార్లు, బ్రాండ్‌లు వచ్చి చేరాయి. అయితే అమ్మకాలు తగ్గడం, కఠినమైన నిబంధనలకు అనుగుణంగా ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతున్న కారణంగా కొన్ని మోడల్‌ల నిష్క్రమణ కూడా 2022లో జరిగింది. Volkswagon పోలో: వోక్స్‌వ్యాగన్ పోలో ధర రూ. 6.45 లక్షలు నుండి రూ. 10.25 లక్షలు. భారతదేశంలో 12 సంవత్సరాల కాలంలో దాదాపు 25 లక్షల యూనిట్లు అమ్మకాలు జరిగాయి. ఇక్కడ బెస్ట్ సెల్లింగ్ బ్రాండ్స్ లో ఒకటిగా నిల్చింది. మారుతి సుజుకి ఎస్-క్రాస్: ధర రూ. 8.95 లక్షల నుండి రూ. 12.92 లక్షలు. 2015లో మొదలైన ఈ కార్ వలన ఆశించిన సేల్స్ జరగలేదు. అందుకే నిలిపివేయాలని తయారీ సంస్థ నిర్ణయించుకుంది.
అమ్మకాలు జరగకపోవడం కూడా మోడల్స్ నిలిపివేతకు కారణం
Hyundai ELANTRA: ధర రూ. 17.86 లక్షల నుండి రూ. 21.13 లక్షలు. SUVల మీద అందరికి ఆసక్తి పెరుగుతుండడం వలన సెడాన్ కొనేవారు కరువయ్యారు. అందుకే తయారీ సంస్థ ఈ బ్రాండ్ అమ్మకాలు నిలిపివేసింది. మహీంద్రా ఆల్టురాస్ G4 బ్రాండ్: ధర రూ. 30.68 లక్షలు. కనీస అమ్మకాలకు కూడా నోచుకోకపోవడంతో ఈ బ్రాండ్ ను మహీంద్రా సంస్థ నిలిపివేసింది. Datsun Redi-go: Nissan సంస్థ ద్వారా భారతీయ మార్కెట్ లోకి వచ్చిన జపాన్ మోడల్ ఇది. అమ్మకాలు బాగానే జరిగినప్పటికీ తయారీ సంస్థ భారతదేశంతో పాటు కొన్ని దేశ మార్కెట్ల నుండి ఈ మోడల్ ను తప్పించింది.