
Ratan Tata :నానో కారును తయారు చేసి ఆటోమొబైల్ ప్రపంచాన్ని షేక్ చేసిన రతన్ టాటా
ఈ వార్తాకథనం ఏంటి
లక్ష రూపాయలకే కారు. అంతే దాంట్లో మరో మాట లేదు. లక్ష రూపాయలు అంటే మిడిల్ క్లాస్ వ్యక్తి ఈ రోజు బైక్ కొనేందుకు పెట్టే ఖర్చు.
ఈ రేట్లో కారు కొనడం ద్వారా ప్రతీ సామాన్యుడు కారు ఓనర్ అవుతాడని రతన్ టాటా కలలు కనేవారు.
ఆయన ఆలోచనల నుంచి పుట్టింది టాటా నానో కారు. ఈ ఒక్క ఆలోచన, ఈ ఒక్క ప్రకటన ఆటోమొబైల్ ప్రపంచాన్ని షేక్ చేసింది.
మనమేమో కోట్లు కోట్లు పెట్టి కార్లలో విలాసాలు పెడుతుంటే,ఈ పెద్దాయన లక్ష రూపాయలకే కారు ఇచ్చేస్తానంటూ కుళ్లుకోని కార్ల కంపెనీలు ఆ సమయంలో ఉండి ఉండవు.
చిన్నధరలో ఓ కుటుంబం ఆనందంగా ట్రావెల్ చేయగలిగేలా నానో కారు రూపొందించారు.
వివరాలు
సేఫ్టీ విషయంలో చాలా ఇష్యూస్
ఈ కారును 2008లో రతన్ టాటా తీసుకువచ్చారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయింది.
దురదృష్టవశాత్తు, నానో కారు అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఎఫర్డ్ బుల్ కానీ కారు బుకింగ్‌కి దొరికేది కాదు.
లో కాస్ట్ అయినప్పటికీ, సేఫ్టీ విషయంలో చాలా ఇష్యూస్ ఉండేవి. సరైన ఆర్‌ఎన్డీ వ్యవస్థ లేకపోవడంతో చిన్న చిన్న లోపాలను సవరించడానికి ఎక్కువ సమయం తీసుకునేవారు.
ఈలోగా నానో కారు గురించి నెగటివ్ ప్రచారం మొదలైంది. మొత్తానికి, నానో కారు ఓ ఫెయిల్యూర్ మోడల్ అని ప్రచారం జరిగిపోయింది.రతన్ టాటా ఆలోచన ఉన్నతమైనది.
వివరాలు
2018లో నిలిపేసిన టాటా నానో ఉత్పత్తి
లక్ష రూపాయల్లో ధనవంతులు పొందే విలాసాలను సామాన్యులకు అందించాలనుకున్నారు ఆయన. కానీ ఫలితం వేరేలా వచ్చింది.
2018లో టాటా నానో కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.కానీ,రతన్ టాటా నానో కారును ఫెయిల్యూర్ అనటానికి ఇష్టపడేవారు కాదు.
అందుకే ఆయనే సొంతంగా నానో కారులో తిరుగుతూ తన కలను నెరవేర్చుకోలేకపోయాననే బాధపడేవారని చెబుతుంటారు సన్నిహితులు.