Ford: 85వేల ఎస్‌యూవీలను రీకాల్ చేసిన ఫోర్డ్.. కారణమిదే
ప్రముఖ ఎస్‌యూవీల తయారీ సంస్థ ఫోర్డ్ కీలక ప్రకటన చేసింది. దాదాపు 85వేల ఎస్‌యూవీలను రీకాల్ చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నట్లు పేర్కొంది. ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో రీకాల్ చేయనున్నట్లు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) తెలిపింది. 2020 నుండి 2022 వరకు 3.3-లీటర్ హైబ్రిడ్ లేదా పెట్రోల్ ఇంజన్‌తో కూడిన వాహనాలకు మాత్రమే ఇది వర్తించనుంది. ఈ వాహనాల్లో ఇంజిన్ వైఫల్యం, ఇంధన ఆవిరిని అండర్-హుడ్ ప్రాంతంలోకి విడుదల చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అగ్ని ప్రమాదం చోటు చేసుకొనే అవకాశం
దీనివల్ల ఇంజిన్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకొనే అవకాశముంది. ఉత్తర అమెరికాలో ఇలాంటి ఘటనలు జరిగాయని పలు నివేదికలు వెల్లడించాయి. ఇప్పటివరకూ ఎలాంటి ప్రమాదాల గురించి తమ దృష్టికి తెలియలేదని ఫోర్డ్ పేర్కొంది. అయితే భద్రతా చర్యలపై వారికి సలహాలు ఇస్తూ వారికి లేఖ పంపాలని కంపెనీ యోచిస్తోంది. ఫోర్డ్ ప్రస్తుతం తన ఎక్స్‌ప్లోరర్ SUVలలో ఇంజిన్ ఫైర్ రిస్క్ కోసం సర్వీస్ రెమెడీపై పని చేస్తోంది. అవసరమైన భాగాలు, సాఫ్ట్‌వేర్ వచ్చే ఏడాది రెండవ త్రైమాసికం నాటికి అందుబాటులోకి రానున్నాయి.