
ADAS Safety Features : హోండా అమేజ్ నుంచి ఎంజీ ఆస్టర్ వరకు.. ఏడీఎఎస్ ఫీచర్లు కార్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
గతంలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్స్ కేవలం ఖరీదైన లగ్జరీ కార్లకు పరిమితం అయ్యేవి. కానీ 2025 నాటికి, భారతదేశంలోని అనేక ప్రముఖ కార్ల బ్రాండ్లు ఈ భద్రతా సాంకేతికతలను సాధారణ ఖరీదులో అందిస్తున్నాయి. చిన్న సెడాన్ల నుండి ఆధునిక ఎస్‌యూవీల వరకు, కొనుగోలుదారులు ఇప్పుడు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్, ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్స్‌ను ఆస్వాదించవచ్చు, ఇవన్నీ ప్రమాదాలను తగ్గించడంలో, డ్రైవర్ అలసటను నివారించడంలో సహాయపడతాయి. ఇక్కడ రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు ధరలో లభిస్తున్న, లెవెల్-2 ADAS ఫీచర్స్ కలిగిన టాప్-5 కార్ల వివరాలను తెలుసుకుందాం.
Details
1. హోండా అమేజ్ - అత్యంత చౌకైన ADAS కార్
హోండా అమేజ్ టాప్-స్పెక్ ZSX వేరియంట్‌లో లెవెల్-2 ADAS ఫీచర్స్‌తో లభిస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (90 HP), మ్యాన్యువల్ లేదా CVT గియర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, కొలిజన్ మిటిగేషన్ వంటి ముఖ్య భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర: రూ. 9.15 లక్షలు (ఎక్స్-షోరూమ్)
Details
2. హ్యుందాయ్ వెన్యూ - ఆధునిక భద్రతా ఫీచర్స్ కలిగిన కాంపాక్ట్ SUV
హ్యుందాయ్ వెన్యూ SX(O) వేరియంట్ ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్-కీపింగ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ వంటి ADAS ఫీచర్స్ అందిస్తుంది. ఇది సబ్జెక్ట్‌గా విలువైన SUVగా ఉంటుంది. ధర: రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) 3. మహీంద్రా ఎక్స్‌యూవీ 3Xo - టెక్నాలజీకి ముందుండే SUV EX3Xo మోడల్ AX5L, AX7L ట్రిమ్‌లలో లెవెల్-2 ADAS ఫీచర్స్ అందిస్తుంది. లేన్-కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ వంటి సాంకేతికతలు ఉన్నాయి. శక్తివంతమైన టర్బో-చార్జ్డ్ ఇంజిన్, ప్రీమియం ఇంటీరియర్స్, అద్భుతమైన భద్రతతో, ఇది సబ్-4 మీటర్ల SUV విభాగంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ధర: రూ. 11.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)
Details
4. హోండా సిటీ - సౌకర్యంతో భద్రత
హోండా సిటీ ఇప్పుడు హోండా సెన్సింగ్ సూట్ కింద లెవెల్-2 ADAS ఫీచర్స్ అందిస్తుంది. లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. మెరుగైన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, స్మూత్ CVTగియర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది. ధర:రూ. 12.70 లక్షలు(ఎక్స్-షోరూమ్) 5.ఎంజీ ఆస్టర్ - స్టైలిష్, స్మార్ట్ SUV MG ఆస్టర్ SAVVY Pro ట్రిమ్ ద్వారా మిడ్‌సైజ్ SUV విభాగంలో లగ్జరీ స్థాయి ADASఫీచర్స్ అందిస్తుంది. బ్లైండ్-స్పాట్ డిటెక్షన్, ఆటోనమస్ బ్రేకింగ్, ప్రీమియం ఇంటీరియర్‌లు, శక్తివంతమైన ఫీచర్లతో ఈSUV ఆకర్షణీయంగా ఉంటుంది. ధర: రూ. 15.16 లక్షలు(ఎక్స్-షోరూమ్) ఈ టాప్-5 కార్లు ఇప్పుడు భద్రత, ఆధునిక టెక్నాలజీ, అఫార్డబుల్ ధరతో భారత కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.