Page Loader
From KTM to TVS: సెప్టెంబర్‌లో రిలీజ్ కానున్న మోటర్ సైకిళ్లు ఇవే!
2024 KTM 390 డ్యూక్

From KTM to TVS: సెప్టెంబర్‌లో రిలీజ్ కానున్న మోటర్ సైకిళ్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2023
01:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియాలో టూవీలర్స్ కి నిత్యం డిమాండ్ పెరుగుతోంది.ప్రతేడాది కొత్త ఆఫర్లతో ప్రముఖ ఆటో దిగ్గజ కంపెనీలు నూతన బైక్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం సెప్టెంబర్ నెలలో కేటీఎం నుంచి టీవీఎస్ వరకూ నూతన బైక్స్ మార్కెట్లోకి పరిచయం చేయడానికి ఆయా సంస్థలు పోటీపడుతున్నాయి. 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 సెప్టెంబర్ 1న రిలీజ్ 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. డిజైన్ కాకుండా, రెట్రో-క్రూయిజర్ విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ బైక్ J-సిరీస్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా కొత్త ఛాసిస్, ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈబైక్ మూడు వేరియంట్‌లలో రానుంది.హోండా H'ness CB350, బైక్ కు ఈ బైక్ గట్టి పోటీ ఇవ్వనుంది.

Details

కేటీఎం 390 డ్యూక్ లో అధునాతన ఫీచర్లు  

సెప్టెంబర్ 6న మార్కెట్లోకి TVS అపాచీ 310 స్ట్రీట్ TVS మోటార్ కంపెనీ సెప్టెంబర్ 6న Apache 310 స్ట్రీట్‌ను రిలీజ్ చేయనుంది. TVS, BMW Motorrad మధ్య భాగస్వామ్యంతో, మోటార్‌సైకిల్ G 310 R మోడల్‌తో పాటు కొన్ని ప్రీమియం హార్డ్‌వేర్ మరియు ఫీచర్లను కూడా పంచుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. వచ్చే నెలలో KTM 390 డ్యూక్ కేటీఎం 390 బైకుకు యువతలో మంచి క్రేజ్ ఉంది. 399cc, లిక్విడ్-కూల్డ్ తో పాటు సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఈ బైక్ కలిగి ఉంది. ఈ 390 డ్యూక్ ఇండియన్ మార్కెట్లోకి రావడంతో పోటీ ఎక్కువయ్యే అవకాశం ఉంది.