
GST 2.0: జీఎస్టీ 2.0 కింద చౌకగా లభించే కార్లు,బైక్‌ల పూర్తి జాబితా
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని వాహన కొనుగోలుదారులకు అతిపెద్ద శుభవార్త. ఎంతోకాలంగా ఎదురుచూసిన జీఎస్టీ 2.0 నేటి నుండి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పన్ను విధానం వల్ల,కార్లు,ద్విచక్ర వాహనాల ధరలు భారీగా తగ్గాయి. సాధారణ హ్యాచ్‌బ్యాక్ కార్లపై సుమారు రూ. 40,000 నుంచి,అత్యంత ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీలపై రూ. 30 లక్షల వరకు తగ్గింపులు వచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయం ఆటో మొబైల్ రంగంలో కొత్త ఉత్సాహాన్ని సృష్టించింది. జీఎస్టీ 2.0కింద పన్ను రేట్ల సవరణతో, ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఈ లాభాన్ని నేరుగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. దీంతో మారుతి సుజుకీ బడ్జెట్ కార్ల నుండి రేంజ్ రోవర్ వంటి ప్రీమియం వాహనాల వరకు అన్ని వాహనాల ధరల్లో తగ్గింపు నమోదు అయింది.
వివరాలు
వివిధ కంపెనీల ధరల తగ్గింపులు:
మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా, కియా, హ్యుందాయ్ వంటి ప్రధాన కంపెనీలు తమ మోడళ్లపై తగ్గింపులు ప్రకటించాయి. మహీంద్రా: వాహనాలపై రూ. 1.56 లక్షల వరకు తగ్గింపు; స్కార్పియో-ఎన్‌పై రూ. 1.45 లక్షలు, థార్‌పై రూ. 1.35 లక్షలు. టాటా మోటార్స్: నెక్సాన్‌పై రూ. 1.55 లక్షలు, సఫారీపై రూ. 1.45 లక్షల వరకు తగ్గింపు. టయోటా: ఫార్చ్యూనర్‌పై రూ. 3.49 లక్షలు తగ్గింపు. రేంజ్ రోవర్: అత్యంత ఖరీదైన మోడళ్లపై రూ. 30.4 లక్షల వరకు తగ్గింపు. కియా: కార్నివాల్‌పై రూ. 4.48 లక్షల భారీ తగ్గింపు. మారుతి సుజుకీ: ఆల్టో కే10పై రూ. 40,000, ఇన్విక్టోపై రూ. 2.25 లక్షల వరకు తగ్గింపు.
వివరాలు
ద్విచక్ర వాహనాలకు ఊరట:
98 శాతం మార్కెట్ వాటా కలిగిన 350 సీసీ లోపు ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేటును 28% నుంచి 18%కి తగ్గించడం సామాన్యులకు పెద్ద ఊరట కలిగిస్తోంది. వీటిలో హీరో స్ప్లెండర్, బజాజ్ పల్సర్, టీవీఎస్ అపాచీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వంటి అత్యధికంగా అమ్ముడయ్యే బైకులు ఉన్నాయి. హోండా యాక్టివా స్కూటర్: సుమారు రూ. 7,874 తగ్గింపు హోండా షైన్ బైక్: సుమారు రూ. 7,443 తగ్గింపు మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ధరల తగ్గింపు పండుగ సీజన్‌లో బైకులు, కార్ల అమ్మకాలను మరింతగా పెంచుతుందని అంచనా వేస్తున్నారు.