LOADING...
Bajaj Chetak Electric: కస్టమర్లకు గుడ్ న్యూస్.. బజాబ్ ఆటో నుంచి అప్డేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
కస్టమర్లకు గుడ్ న్యూస్.. బజాబ్ ఆటో నుంచి అప్డేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

Bajaj Chetak Electric: కస్టమర్లకు గుడ్ న్యూస్.. బజాబ్ ఆటో నుంచి అప్డేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 30, 2026
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు బజాజ్ ఆటో కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ తన ప్రాచుర్యం పొందిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌కు తాజా పనితీరు, ఫీచర్ అప్‌డేట్‌లను అందించింది. ముఖ్యంగా ఈ మార్పుల తర్వాత కూడా ధరలను పెంచకపోవడం వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది. ప్రస్తుతం కంపెనీ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఐదు వేరియంట్లలో అందిస్తోంది. గతంలో C2501, C3001, C3501, C3502, C3503 పేర్లతో ఉన్న మోడళ్లను ఇప్పుడు C25, C30, C35 వంటి సింపుల్ పేర్లతో మార్చింది. ఈ పేరు మార్పుతో పాటు అన్ని వేరియంట్లలో పలు ముఖ్యమైన అప్‌డేట్‌లు చేయడం గమనార్హం.

వివరాలు

టాప్ స్పీడ్‌ను 55 కి.మీ

పనితీరు పరంగా బేస్ వేరియంట్ టాప్ స్పీడ్‌ను 55 కి.మీ/గం నుంచి 60 కి.మీ/గం వరకు పెంచారు. మధ్యస్థ వేరియంట్లలో ఇది 70 కి.మీ/గం వరకు ఉండగా, టాప్ ఎండ్ మోడళ్లలో గరిష్ట వేగం 80 కి.మీ/గం వరకు ఉంది. అదనంగా బ్యాటరీ ఛార్జింగ్ వేగాన్ని కూడా మెరుగుపరిచారు. ఒక వేరియంట్‌లో 0-80 శాతం ఛార్జింగ్ సమయాన్ని 3.5 గంటల నుంచి 2.55 గంటలకు తగ్గించారు. ఫీచర్ల విషయానికి వస్తే ఎకో, స్పోర్ట్ మోడ్‌లతో పాటు హిల్-హోల్డ్ అసిస్ట్‌ను ఇప్పుడు స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. అలాగే టాప్ వేరియంట్లలో ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌ల సౌకర్యాన్ని కల్పించారు. దీంతో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల కోసం సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

వివరాలు

నావిగేషన్‌ను యాప్ ద్వారా గూగుల్ మ్యాప్స్ కనెక్ట్

అదనంగా గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌ను యాప్ ద్వారా కనెక్ట్ చేసే ఫీచర్‌ను కూడా జోడించారు. రేంజ్ పరంగా బేస్ వేరియంట్ 113 కి.మీ. వరకు ప్రయాణించగలగగా, ఇతర వేరియంట్లు 127 కి.మీ. నుంచి 153 కి.మీ. వరకు రేంజ్‌ను అందిస్తున్నాయి. ధరలు రూ.89,500 నుంచి రూ.1.34 లక్షల మధ్య ఉన్నాయి. మొత్తంగా పనితీరు, ఫీచర్లలో మెరుగుదలలు చేసినప్పటికీ ధరలను యథాతథంగా ఉంచడం ద్వారా బజాజ్ చేతక్ స్కూటర్లు మార్కెట్లో మరింత పోటీగా మారాయి. ముఖ్యంగా రూ.1 లక్షలోపు ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఇది ఆకర్షణీయ ఎంపికగా నిలుస్తోంది.

Advertisement