LOADING...
Nissan Gravity: మధ్యతరగతి కుటుంబాలకు గుడ్‌న్యూస్.. 7 సీటర్ ఎంపీవీ నిస్సాన్ గ్రావిటే హైలైట్స్ ఇవే!
మధ్యతరగతి కుటుంబాలకు గుడ్‌న్యూస్.. 7 సీటర్ ఎంపీవీ నిస్సాన్ గ్రావిటే హైలైట్స్ ఇవే!

Nissan Gravity: మధ్యతరగతి కుటుంబాలకు గుడ్‌న్యూస్.. 7 సీటర్ ఎంపీవీ నిస్సాన్ గ్రావిటే హైలైట్స్ ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2025
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో తన స్థాయిని మరింత బలోపేతం చేసుకునే దిశగా నిస్సాన్ ఇండియా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రానున్న సంవత్సరాల్లో వరుసగా కొత్త మోడళ్లను విడుదల చేయాలని ప్రణాళిక రూపొందించింది. వాటిలో ముఖ్యంగా సరికొత్త 7-సీటర్ ఎంపీవీ - నిస్సాన్ గ్రావిటే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని, బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీల్ అందించేలా ఈ కారును రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఎంపీవీకి సంబంధించిన ఒక టెస్ట్ మోడల్ భారత రోడ్లపై కనిపించడంతో, కారుకు సంబంధించిన పలు ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Details

నిస్సాన్ గ్రావిటే - ఇండియా లాంచ్ టైమ్‌లైన్

రోడ్లపై టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించిన నిస్సాన్ గ్రావిటే ఎంపీవీని వచ్చే ఏడాది మార్చి 2026లో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ధరలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అధికారిక లాంచ్‌కు ముందే ఈ కారు టెస్టింగ్ దశలో ఉండగా, జాతీయ రహదారిపై వెళ్తున్న వీడియోను వివేక్ ఆర్ అనే వ్యక్తి చిత్రీకరించారు. కారు మొత్తం కామోఫ్లాజ్‌తో కప్పి ఉన్నప్పటికీ, దీని డిజైన్ రెనాల్ట్ ట్రైబర్‌ను పోలి ఉండటం గమనార్హం. రెనాల్ట్-నిస్సాన్ భాగస్వామ్యంలో రూపొందుతున్న ఈ ఎంపీవీ CMF-A+ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చెందుతోంది.

Details

నిస్సాన్ గ్రావిటే - డిజైన్ వివరాలు

గ్రావిటే ఎంపీవీకి స్టైలిష్, రగ్గడ్ లుక్ ఇవ్వనున్నారు. ముందు భాగంలో సన్నని ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్, బోనెట్‌పై స్పష్టంగా కనిపించేలా 'GRAVITE' బ్యాడ్జింగ్ ఉండనుంది. మధ్యలో పెద్ద గ్రిల్, సీ-షేప్ బంపర్ ఈ కారుకు బలమైన ఫ్యామిలీ ఎంపీవీ లుక్‌ను అందిస్తాయి. ఈ మోడల్ కోసం నిస్సాన్ ప్రత్యేకంగా 'టీల్' కలర్ ను పరిచయం చేయనుంది. స్పోర్టీ అలాయ్ వీల్స్, బాడీ క్లాడింగ్ కారణంగా కారుకు ఎస్‌యూవీ తరహా ఫీల్ వస్తుంది. వెనుక భాగంలో సీ-షేప్ టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ టచ్‌తో ప్రీమియం లుక్‌ను అందించారు.

Advertisement

Details

నిస్సాన్ గ్రావిటే - ఇంజిన్ & పనితీరు

ఈ ఎంపీవీలో 1.0 లీటర్ నేచురల్లి ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను వినియోగిస్తున్నారు. ఇది 76 బీహెచ్‌పీ పవర్, 95 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ ఎంపికలుగా కస్టమర్లకు రెండు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. 5-స్పీడ్ మాన్యువల్ 5-స్పీడ్ ఏఎంటీ ప్రత్యేకంగా సిటీ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేసే వారికి ఏఎంటీ వేరియంట్ మరింత సౌకర్యంగా ఉండనుంది.

Advertisement

Details

నిస్సాన్ గ్రావిటే - ఇంటీరియర్ & ఫీచర్లు

ఫీచర్ల విషయంలో రెనాల్ట్ ట్రైబర్‌తో చాలా సామ్యాలు ఈ గ్రావిటే ఎంపీవీలో కనిపించనున్నాయి. ఇందులో 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 7-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ భద్రతకు పెద్దపీట వేస్తూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, మల్టీ-వ్యూ కెమెరా వంటి ఫీచర్లను నిస్సాన్ అందిస్తోంది. బ్రాండ్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఇంటీరియర్ కలర్స్, సీట్ అప్‌హోల్స్టరీని కొత్తగా డిజైన్ చేస్తున్నారు. రెండో, మూడో వరుస ప్రయాణికులకు ప్రత్యేకంగా ఏసీ వెంట్స్ ఉండటం వల్ల పెద్ద కుటుంబాలకు ఈ కారు మరింత అనుకూలంగా ఉంటుంది.

Details

ధరే కీలకం

భారత మార్కెట్‌లో ప్రస్తుతం తక్కువ ధరలో లభిస్తున్న ఫ్యామిలీ ఎంపీవీల్లో రెనాల్ట్ ట్రైబర్ ఒకటి. అదే స్థాయిలో లేదా పోటీ ధరలో నిస్సాన్ గ్రావిటేను తీసుకొస్తే, ఎక్కువ సీటింగ్ సామర్థ్యం, ఆధునిక ఫీచర్లు కోరుకునే భారతీయ కుటుంబాలకు ఇది ఒక బలమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని ఆటో మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement